Hyderabad: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌పై బొంతు రామ్మోహన్ ఫోటోలు..
అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో డిజిటల్ స్క్రీన్‌పై హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ చిత్రాలను ప్రదర్శించారు ఆయన అభిమానులు. ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మహేశ్ తనయ సితార నటించిన ప్రకటనను అమెరికా వాణిజ్య రాజధానిగా గుర్తింపు పొందిన న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్ స్క్వేర్ వద్ద డిస్‌ప్లే చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇటు మహేశ్‌తో పాటు అటు సితార సైతం ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా మరో తెలుగు వ్యక్తి అదే గౌరవాన్ని అందుకున్నారు. ఆయనెవరో కాదు హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. జలై 5న రామ్మోహన్ జన్మదినం సందర్భంగా 22 వేల చదరపు అడుగుల భారీ స్క్రీన్ పై ” హ్యాపీ బర్త్ డే బొంతు రామ్మోహన్ ” అంటూ ప్రదర్శించారు ఆయన ఫ్యాన్, ఫాలోవర్ ముదిరెడ్డి శ్రావణ్. విశ్వనగరంగా హైదరాబాద్ మార్పులో ఆయన కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు.
బొంతు రామ్మోహన్ ఆయన అనుచరులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఉప్పల్ నియోజకవర్గంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించి.. అన్నదాన, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. తన పుట్టినరోజున విషెస్ తెలియజేసిన అందరికీ బొంతు రామ్మోహన్ ధన్యవాదాలు తెలిపారు.
View this post on Instagram
కాగా మొన్నామధ్య అన్న ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా.. టైమ్ స్క్వేర్‌లో ఒక రోజంతా సీనియర్ ఎన్టీఆర్ చిత్రమాలికను డిజిటల్ స్క్రీన్‌పై ప్రదర్శించారు. ప్రతి నాలుగు నిమిషాలకోసారి 15 సెకన్ల పాటు అన్నగారి ఫోటోలు కనిపించాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..