సంచలనం సృష్టిస్తోన్న స్మితా సబర్వాల్ ట్వీట్..మహిళల చేతుల్లోకి త్వరలోనే ఆయుధాలంటూ..

స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. మహిళల విషయంలో మీరు చేస్తున్న పోరాటం అభినందనీయం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంచలనం సృష్టిస్తోన్న స్మితా సబర్వాల్ ట్వీట్..మహిళల చేతుల్లోకి త్వరలోనే ఆయుధాలంటూ..
Smita Sabharwal
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 08, 2022 | 2:02 PM

సామాజిక సమస్యలపై ఎక్కువగా స్పందించే ఐఏఎస్ ఆఫీసర్, సీఎంఓ సెక్రటరీ స్మితా సబర్వాల్ చేసిన ట్విట్ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. స్మితా సబర్వాల్‌ చేసిన తాజా ట్విట్‌ సంచలనం రేపుతోంది. గ్యాంగ్ రేప్ కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. ట్విట్టర్ ద్వారా ఆమె చేసిన వ్యాఖ్యలకు మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముందస్తు విచారణకు అవకాశం లేదనే కారణంతో గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఓ నిందితుడి శిక్షను గత వారం మధ్యప్రదేశ్ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. 25 ఏళ్లకు విధించిన శిక్షను సస్పెండ్ చేస్తూ జస్టిస్ రోహిత్ ఆర్య మరియు జస్టిస్ రాజీవ్ కుమార్ శ్రీవాస్తవ ధర్మానం నిందితుడికి రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. సదరు నిందితుడు ప్రస్తుతం బెయిల్ పై విడుదలయ్యాడు.

ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పలువురు మహిళలు,ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ ఘటనపై తాజాగా స్మితా సబర్వాల్ సైతం స్పందించారు. ‘న్యాయవ్యవస్థలో నిరాశ కలిగించే ఈ తరహా తీర్పులు ఇంకా కొనసాగితే.. ఈ దేశంలోని మహిళలకు ఆయుధాలు ధరించే హక్కును అనుమతించే సమయం ఆసన్నం అవుతుందన్నారు.. న్యాయం, చట్టం రెండు వేర్వేరు విషయాలు కావు. ఇది సిగ్గుచేటు’ అంటూ కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి

స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. మహిళల విషయంలో మీరు చేస్తున్న పోరాటం అభినందనీయం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి