Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kartika Purnima 2022: కార్తీక పూర్ణిమ స్నానం ఎప్పుడు చేయాలో తెలుసా? పవిత్ర గంగానదిలో లక్షలాది మంది భక్తులు..

ఈ యేడాది కార్తీక పౌర్ణమి నవంబర్ 7 సోమవారం సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు సంపూర్ణ పౌర్ణమి తిథి మొదలైంది.. నవంబర్ 8వ తేదీన సాయంత్రం ..

Kartika Purnima 2022: కార్తీక పూర్ణిమ స్నానం ఎప్పుడు చేయాలో తెలుసా? పవిత్ర గంగానదిలో లక్షలాది మంది భక్తులు..
Kartika Purnima
Follow us
Jyothi Gadda

| Edited By: Anil kumar poka

Updated on: Nov 08, 2022 | 2:21 PM

కార్తిక పూర్ణిమ నాడు తులసి మొక్కను పూజించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరిస్తాయని నమ్మకం. ఈ ఏడాది నవంబర్ 8 మంగళ వారం రోజున కార్తీక పూర్ణిమ వస్తోంది. కార్తీక మాసం అత్యంత శుభకరమైన మాసంగా దీన్ని చెప్పుకుంటారు. కార్తీక పూర్ణిమ నాడు నదీ స్నానం లేదా సముద్ర స్నానం ఆచరిస్తారు. దీప దానం చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజు చేసే పూజ ఏడాది పొడవునా చేసే పూజా ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం. కార్తీక మాసంలోనే విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ యేడాది కార్తీక పౌర్ణమి నవంబర్ 7 సోమవారం సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు సంపూర్ణ పౌర్ణమి తిథి మొదలైంది.. నవంబర్ 8వ తేదీన సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు పూర్తికానుంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ప్రజలు పౌర్ణమి స్నానాలు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలలోపు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

కార్తీక పౌర్ణిమ ప్రాశస్త్యం కార్తిక పౌర్ణిమను త్రిపురి పౌర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజున మహాదేవుడు త్రిపురాసురుని వధించినట్టు చెబుతారు. త్రిపురాసురిని వధించిన శుభసందర్భంలో కాశిలో దీపాలు వెలిగించి పండగ చేశారు. అందువల్ల దీనిని దేవ దీపావళి అని కూడా అంటారు.

కార్తీక స్నాన ప్రాశస్త్యం కార్తీక మాసంలో ముఖ్యంగా పౌర్ణిమ నాడు చేసే నదీ స్నానం సకల పాపాల నుంచి విముక్తిని ఇస్తుందని ప్రతీతి. స్వర్గం నుంచి దేవతలు కూడా ఈ రోజున గంగా స్నానానికి వస్తారని నమ్మకం. అందుకే ఈ రోజున తప్పకుండా నదీ స్నానం చెయ్యాలి. నదీ స్నానం చెయ్యడం సాధ్యపడని వారు కనీసం ఇంట్లో అయినా గంగాజలం కలుపుకొని స్నానమాచరించడం మంచిది.

ఇవి కూడా చదవండి

కార్తీక పౌర్ణమి పూజకు శుభ ముహూర్తం.. కార్తీక పౌర్ణమి పూజ, కార్తీక పూర్ణిమ రోజున స్నానమాచరించే శుభ సమయం సాయంత్రం 4:31 గంటల వరకు ఉంటుంది. శాస్త్రాల ప్రకారం, కార్తీక పౌర్ణమి నాడు గంగానదిలో లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేసి, సూర్య భగవానుడికి నీటిని సమర్పించి, ఆ తర్వాత భగవంతుని ముందు ఉపవాసం వదులుకుంటే పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి.. శ్రీ హరి విష్ణువు, లక్ష్మీ దేవి సన్నిధిలో పూజించడం శ్రేయస్కరం.

ఈ సందర్బంగా ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు, భక్తులు పవిత్ర గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం నిఘా వర్గాలతో పాటు డాగ్ స్క్వాడ్, సివిల్ పోలీసులను భారీ సంఖ్యలో మోహరించింది. గంగా మేళాలో ప్రతి మూలలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి