AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తమ్ముడి మృతితో తల్లడిల్లిన తోబుట్టువు.. పాడే మీదే చివరి రాఖీ కట్టిన అక్క!

తమ చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. తండ్రి పెంపకంలో ఇద్దరూ కలిసి పెరిగారు. తమ్ముడంటే ఆ అక్కకు ఎంతో ప్రేమ. ప్రతీ ఏడాది రాఖీ పండుగ రోజున తప్పకుండా సోదరుడికి రాఖీ కట్టి తన ప్రేమను చాటుకుంటుంది అక్క. కానీ ఈసారి ఆ తోబుట్టువుకు కన్నీరే మిగిలింది. అనారోగ్యంతో మృతి చెందిన తమ్ముడికి చివరి రాఖీ కట్టి తల్లడిల్లిపోయింది.

Telangana: తమ్ముడి మృతితో తల్లడిల్లిన తోబుట్టువు.. పాడే మీదే చివరి రాఖీ కట్టిన అక్క!
Sister Tied A Rakhi To Brother
N Narayana Rao
| Edited By: |

Updated on: Aug 11, 2025 | 1:47 PM

Share

తమ చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. తండ్రి పెంపకంలో ఇద్దరూ కలిసి పెరిగారు. తమ్ముడంటే ఆ అక్కకు ఎంతో ప్రేమ. ప్రతీ ఏడాది రాఖీ పండుగ రోజున తప్పకుండా సోదరుడికి రాఖీ కట్టి తన ప్రేమను చాటుకుంటుంది అక్క. కానీ ఈసారి ఆ తోబుట్టువుకు కన్నీరే మిగిలింది. అనారోగ్యంతో మృతిచెందిన తమ్ముడికి చివరి రాఖీ కట్టి తల్లడిల్లిపోయింది.

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన తమ్ముడికి అక్క రాఖీ కట్టిన ఘటన అక్కడికి వచ్చిన వారందరికీ కంటతడి పెట్టించింది. కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన పందిరి అప్పిరెడ్డి(25) అనారోగ్యంతో మృతి చెందాడు. రాఖీ పండుగ ముందు రోజు మృతి చెందిన తమ్ముడిని చూసి అక్క తల్లడిల్లిపోయింది. చివరిసారిగా తమ్ముడి రుణం తీర్చుకుంది అక్క జ్యోతి. తమ్ముడు అప్పిరెడ్డికి పాడెపైనే రాఖీ కట్టింది.

జ్యోతికి తమ్ముడు అప్పిరెడ్డి అంటే ఎంతో ఇష్టం. ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజున తప్పకుండా సోదరుడికి రాఖీ కట్టి, తన ప్రేమను చాటుకుంటుంది. అయితే ఈసారి ఆమె రాఖీ కట్టే సమయానికి తమ్ముడు అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో మృతి చెందిన తన తమ్ముడు అప్పిరెడ్డికి రాఖీ కట్టి ఇదే నా చివరి రాఖీ చిన్నా.. అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా గుండలివేలే రోదించారు.

తన సోదరుని మృతదేహాన్ని పట్టుకుని.. తమ్ముడూ… చిన్న నాటి నుంచి తల్లి లేకుండానే పెరిగాం. నీవు కూడా నన్ను వదిలి వెళ్లిపోయావు.. రాఖీ పండక్కి నన్ను రమ్మన్నావు.. ఇప్పుడు నువ్వే లేకుండా పోయావు..’ అంటూ ఆమె రోదించిన తీరు అందరి హృదయాల్ని కలచివేసింది. ‘ఇదే తమ్ముడు నీకు నేను కట్టే చివరి రాఖీ’ అంటూ నిర్జీవంగా చితిపై ఉన్న తమ్ముడి మృతదేహానికి జ్యోతి రాఖీ కట్టింది.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..