AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖరీదైన బైకులపై దేవాలయ సందర్శన.. పోలీసుల చెకింగ్‎లో షాకింగ్ నిజాలు

ఖరీదైన బైక్ లే అతని టార్గెట్. అతను దొంగలించే బైక్ కాస్ట్ మినిమం లక్ష రూపాయలు ఉండాల్సిందే. లక్ష రూపాయల కంటే తక్కువ బైక్స్‎ను అతను టచ్ కూడా చేయడు. అలా దొంగతనం చేసిన బైక్స్‎పై దర్జాగా డ్రైవ్ చేస్తూ రాష్ట్రం మొత్తం తిరగడం అతని హాబీ. మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రం అయిన తమిళనాడు వెళ్లి అక్కడ ఉన్న ఆలయాలను దర్శించుకొని వచ్చాడు. కానీ అన్ని టైంలు ఓకేలాగా ఉండదు కదా. అందుకే ప్రస్తుతం పోలీస్‎లకు దొరికిపోయాడు. ఈ ఖరీదైన దొంగను అరెస్టు చేసి రూ.40 లక్షల విలువ చేసే 19 బైక్‎లను స్వాధీనం చేసుకున్నారు సిద్దిపేట పోలీసులు.

ఖరీదైన బైకులపై దేవాలయ సందర్శన.. పోలీసుల చెకింగ్‎లో షాకింగ్ నిజాలు
Byke
P Shivteja
| Edited By: |

Updated on: Jun 26, 2024 | 7:48 PM

Share

ఖరీదైన బైక్ లే అతని టార్గెట్. అతను దొంగలించే బైక్ కాస్ట్ మినిమం లక్ష రూపాయలు ఉండాల్సిందే. లక్ష రూపాయల కంటే తక్కువ బైక్స్‎ను అతను టచ్ కూడా చేయడు. అలా దొంగతనం చేసిన బైక్స్‎పై దర్జాగా డ్రైవ్ చేస్తూ రాష్ట్రం మొత్తం తిరగడం అతని హాబీ. మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రం అయిన తమిళనాడు వెళ్లి అక్కడ ఉన్న ఆలయాలను దర్శించుకొని వచ్చాడు. కానీ అన్ని టైంలు ఓకేలాగా ఉండదు కదా. అందుకే ప్రస్తుతం పోలీస్‎లకు దొరికిపోయాడు. ఈ ఖరీదైన దొంగను అరెస్టు చేసి రూ.40 లక్షల విలువ చేసే 19 బైక్‎లను స్వాధీనం చేసుకున్నారు సిద్దిపేట పోలీసులు. కుమ్మరి సాయికుమార్ వయస్సు 26 ఏళ్లు. నిజామాబాద్ జిల్లా మక్లూర్ గ్రామానికి చెందిన సాయి కుమార్ గత కొద్దిరోజులుగా ఇలాంటి ఖరీదైన బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇటీవల సిద్దిపేట వన్ టౌన్ పరిధిలోని గణేష్ నగర్‎కి చెందిన ఓ వ్యక్తి తన బైక్ పోయిందని పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. గత కొద్దిరోజులుగా బైక్స్ మిస్సింగ్ ఎక్కువ కావడంతో ప్రత్యేక టీమ్స్‎ను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. దీంతో నేడు పాత బస్టాండ్ చౌరస్తా సమీపంలో అనుమానాస్పద పరిస్థితులలో క‌నిపించిన సాయిని అదుపులోకి తీసుకుని విచారించారు.

ఈక్రమంలోనే ద్విచ‌క్ర వాహ‌నాల దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. గతంలో కూడా పలు కేసులు ఉన్నాయని తెలిపారు పోలీసులు. నిందితుడు సాయిపై 2020లో నిజామాబాదు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 8 దొంగతనం కేసులలో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపారు. జైలు నుండి వచ్చిన తరువాత తన ప్రవృత్తి‎ని కొనసాగిస్తూ సుల్తాన్ బజార్, పెట్ బషీర్ బాగ్, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడి చెంచల్గూడ, నిజామాబాదు, చెర్లపల్లి జైలులలో శిక్ష అనుభవించాడు. 2022 సంలో జైలు నుండి విడుదల అయిన తరువాత మళ్లీ వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేస్తూ పట్టుబడ్డాడు. దొంగతనాలు చేసిన బైక్‎లను తన ఇంటి వద్ద దాచిపెడుతూన్నాడు. గణేష్ నగర్‎లో దొంగలించిన బైక్‎ను అమ్మడానికి సిద్దిపేట మీదుగా వెళ్తుండగా నిందింతుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు సాయిని అరెస్ట్ చేసి అతని నుండి చోరీకి గురైన (19) ద్విచ‌క్ర వాహ‌నాలు, 45 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. 2022 జూలై నుంచి జూన్ 2024 మధ్య కాలంలో బైకు దొంగతనాల వివరాలు ఇలా ఉన్నాయి.

జిల్లా వారీగా దొంగతనాలు..

  • హైదరాబాద్ సిటీ పరిధిలో 4 మోటర్ సైకిల్లు,
  • కరీంనగర్ జిల్లా పరిధిలో 3 మోటార్ సైకిల్,
  • నిజామాబాద్ జిల్లా పరిధిలో 6 మోటార్ సైకిళ్ళు,
  • జగిత్యాల జిల్లా పరిధిలో 1 మోటార్ సైకిల్,
  • మెదక్ జిల్లాలో 1 మోటార్ సైకిల్,
  • నిర్మల్ జిల్లా పరిధిలో 1 మోటార్ సైకిల్,
  • సిరిసిల్ల జిల్లా పరిధిలో 1 మోటార్ సైకిల్,
  • సూర్యాపేట జిల్లా పరిధిలో 1 మోటార్ సైకిల్,
  • సిద్దిపేట పట్టణంలో 1 మోటార్ సైకిల్

ఈ కంపెనీల బండ్లు..

  • పల్సర్ మోటార్ సైకిల్ -4
  • రాయల్ ఎన్ఫీల్డ్ -3
  • యమ కెటిఎమ్ 9
  • హోండా యాక్టివా -1
  • హీరో హోండా -2
  • మొత్తం 19 మోటార్ సైకిళ్ళు దొంగలించుకొని పోయినాడు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు..!
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు..!
ఆటలో కోహ్లీని మించిన తోపు.. సెలెక్టర్ల దృష్టిలో పనికిరానోడు
ఆటలో కోహ్లీని మించిన తోపు.. సెలెక్టర్ల దృష్టిలో పనికిరానోడు
10 గ్రాముల బంగారు గొలుసుపై లోన్‌ తీసుకుంటే ఎంత డబ్బు వస్తుంది?
10 గ్రాముల బంగారు గొలుసుపై లోన్‌ తీసుకుంటే ఎంత డబ్బు వస్తుంది?
నిద్రలో ఉన్న భార్యను కాల్చి చంపేందుకు భర్త యత్నం..!
నిద్రలో ఉన్న భార్యను కాల్చి చంపేందుకు భర్త యత్నం..!
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
పవన్ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్! ఆరోగ్య పరిస్థితిపై ఆరా
పవన్ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్! ఆరోగ్య పరిస్థితిపై ఆరా