Watch Video: వాళ్లు కన్నేస్తే అంతే.. అనుమానాస్పదంగా తిరుగుతూ అరెస్ట్ అయిన ముఠా..
మద్యం, జల్సాలకు అలవాటు పడి వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను నారాయణపేట జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు, వివిధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేట జిల్లాలో కాదేది చోరీలకు అనర్హం అన్నట్లు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠా పోలీసులకు చిక్కింది. ఈ ముగ్గురు దొంగలు మద్యం, జల్సాల కోసం అది ఇది అని చూడకుండా దేన్నైన దొంగిలిస్తారు. అలా దొంగిలించిన వస్తువులను అమ్మగా వచ్చిన సొమ్ముతో మద్యం, జల్సాల కోసం ఖర్చు చేస్తారు.
మద్యం, జల్సాలకు అలవాటు పడి వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను నారాయణపేట జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు, వివిధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేట జిల్లాలో కాదేది చోరీలకు అనర్హం అన్నట్లు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠా పోలీసులకు చిక్కింది. ఈ ముగ్గురు దొంగలు మద్యం, జల్సాల కోసం అది ఇది అని చూడకుండా దేన్నైన దొంగిలిస్తారు. అలా దొంగిలించిన వస్తువులను అమ్మగా వచ్చిన సొమ్ముతో మద్యం, జల్సాల కోసం ఖర్చు చేస్తారు. ముగ్గురు కలిసి చోరీలకు పాల్పడిన తర్వాత వచ్చిన సొమ్ములో సమాన భాగంలో పంచుకుని ఎంజాయ్ చేస్తారు. నారాయణపేట జిల్లా గండీడ్ మండలం చిన్న వార్వల్ గ్రామానికి చెందిన గడ్డమీది రామకృష్ణ, నంచర్ల శ్రీను, సాలనగర్కు చెందిన గజ్జి రమేశ్‌లు ముఠాగా ఏర్పడ్డారు. గత కొంత కాలంగా డబ్బుల కోసం వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. అయితే అనుకోకుండా పోలీసుల చిక్కి కటకటాల పాలయ్యారు.
నాకాబందీలో అనుమానస్పద కదలిక..
కోస్గి పట్టణంలో రెండు రోజుల క్రితం సాయంత్రం వేళ శివాజీ చౌరస్తాలో పోలీసులు నాకాబందీ నిర్వహిస్తున్నారు. అయితే రామకృష్ణ, శ్రీను, రమేశ్‌లు అనుమానస్పదంగా కనిపించారు. ఆ వెంటనే పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇంతలో అలెర్ట్ అయిన ఎస్ఐ నరేశ్, సిబ్బంది వాళ్ళని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం వారిని విచారించగా వరుస చోరీల గుట్టు విప్పారు. మద్యం, జల్సాలకు అలవాటుపడి డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఒప్పేసుకున్నారు. మద్దూరు, కోస్గీ మండలాల్లోని గ్రామాల్లో చేసిన చోరీల గురించి విచారణలో అంగీకరించారు. ముగ్గురు దొంగల నుంచి 4.7కిలోల వెండి అభరణాలు, 44గ్రాముల బంగారు అభరణాలు, రూ.1,50,500 నగదు, నాలుగు బోర్ మోటార్లు, సీలింగ్ ఫ్యాన్స్, 9 మేకలు, ల్యాప్ టాప్, టీవీ మరికొన్ని వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు దొంగలు చిక్కడంతో మొత్తం 9 చోరీ కేసులకు పరిష్కారం లభించిందని జిల్లా ఎస్పీ యోగేశ్ గౌతం తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…