AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddipet Collector: చెండాడుతా.. వెంటాడుతా.. అధికారులకు సినిమా స్టైల్లో వార్నింగ్ ఇచ్చిన సిద్దిపేట కలెక్టర్.. వీడియో

Siddipet Collector P.Venkatrama Reddy: ఆయనొక జిల్లా కలెక్టర్.. ఆయన ఎంత హుందాగా ఉండాలో మనం చెప్పక్కర్లేదు. కానీ ఆయన చెలరేగిపోయారు. నేను చెప్పిందే ఫైనల్..

Siddipet Collector: చెండాడుతా.. వెంటాడుతా.. అధికారులకు సినిమా స్టైల్లో వార్నింగ్ ఇచ్చిన సిద్దిపేట కలెక్టర్.. వీడియో
Venkatrama Reddy
Shaik Madar Saheb
|

Updated on: Oct 26, 2021 | 3:41 PM

Share

Siddipet Collector P.Venkatrama Reddy: ఆయనొక జిల్లా కలెక్టర్.. ఆయన ఎంత హుందాగా ఉండాలో మనం చెప్పక్కర్లేదు. కానీ ఆయన చెలరేగిపోయారు. నేను చెప్పిందే ఫైనల్.. జీవో గీవోలాంటివేం ఉండవ్.. ఆర్డర్ కూడా ఇయ్యా.. ఇది నా హుకుం.. అంటూ.. ఊగిపోయారు. ఆయన ఎవరో కాదు తెలంగాణలోని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి. వ్యవసాయశాఖ సమీక్షలో భాగంగా అధికారులపై కోపంతో ఊగిపోయారు. నా మాట కాదని ఏదైనా చేశారో ఖబడ్దార్ అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఒక్కసారిగా అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఎరువులు, విత్తనాల డీలర్లపై నిప్పులు చెరిగారు. చెండాడుతా… వెంటాడుతా… ఖబడ్దార్ అంటూ అధికారులకు అల్టిమేటం ఇచ్చారు. నాకు తెలియకుండా కిలో వరి గింజలు అమ్మారో…అందరినీ సస్పెండ్ చేస్తా.. గుర్తు పెట్టుకోండి అంటూ సినిమా స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు. వరి విత్తనం అమ్మే హక్కు ఎవ్వరికీ లేదు.. ఇది నా హుకుం.. దీనికి జీవో లేదు-ఇంకేం లేదు. ఆర్డర్ కూడా ఇయ్యా.. కానీ, అందరూ నా మాట వినాల్సిందేనంటూ హుకుం జారీ సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సంచలనంగా మారారు. ఒక్క ఎకరం కూడా వరి సాగు చేయడానికి వీలు లేదని.. అలా చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు హుకూం జారీ చేశారు.

రైతులకు వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవంటూ డీలర్లకు హెచ్చరించారు. యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై అధికారులు, విత్తనాలు, ఎరువుల డీలర్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించి ఈ వ్యాఖ్యలు చేశారు. యాసంగిలో ఎవరైనా ఒక్క కేజీ వరి విత్తనాలు విక్రయించినా ఊరుకునేది లేదని.. అమ్మితే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. వ్యాపారం రద్దు చేసి షాపుని మూయించేస్తామంటూ వార్నింగ్‌ ఇచ్చారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వ్యవసాయశాఖ సమీక్షలో డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడంతో అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. తన మాట కాదని ఏమైనా చేస్తే.. చర్యలు తప్పవంటూ హెచ్చరించిన తీరు అందరినీ విస్మయానికి గురిచేసింది.

రైతులకు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి క్షమాపణలు చెప్పాలి: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

రైతు తన స్వంత నిర్ణయంతో పంటలు వేయకూడదా..? సిద్ధిపేట కలెక్టర్ చెప్పిందే వేయాలా..? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. సిద్ధిపేట జిల్లాలో ఏ పంట వేయాలనేది కలెక్టర్ నిర్ణయిస్తారా అంటూ ప్రశ్నించారు. ఏ అధికారంతో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి బెదిరింపులకు దిగుతున్నారో చెప్పాలన్నారు. అవగాహనలేని వెంకట్రామిరెడ్డిని కలెక్టర్‌గా ఎందుకు కొనసాగిస్తున్నారంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతులకు అండగా ఉంటామని.. సిద్ధిపేట కలెక్టర్ మాటలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. రైతులను ఇబ్బందులు పెడితే కాంగ్రెస్ తరపున పోరాటం చేస్తామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రైతులకు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సాయంత్రం లోగా క్షమాపణలు చెప్పాలని.. లేకుంటే సిద్ధిపేట కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజ్యాంగేతరశక్తిగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సిద్ధిపేట కలెక్టర్ కామెంట్స్ తో ప్రభుత్వ ఆలోచనా విధానం స్పష్టమైందని.. దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. కరెంట్ విషయంలో జరిగిన కోనుగోళ్లతో ప్రభాకర్ రావు కనిపించకుండా పోయారంటూ పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందంటూ మండిపడ్డారు.

Also Read:

AP Rain Alert: ఆంధ్రప్రదేశ్‌కు రెయిన్ అలెర్ట్.. రాగల మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు.. వివరాలు..

RGV: నాతో మాట్లాడించొద్దు.. ఆ ‘పదం’ అర్థం తెలీదన్న రామ్ గోపాల్ వర్మ..