AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..

ఏదైనా కంపెనీలో పనిచేస్తే ఎవరికైనా జీతాలు ఇస్తారు..కానీ.. ఓ గజ దొంగ మాత్రం.. దొంగతనం చేయడానికి కూడా కొంతమందిని నియమించుకున్నాడు. వీళ్లకు టార్గెట్ ఇస్తూ దొంగతనాలు చేపిస్తున్నాడు. మహారాష్ట్రకు చెందిన ఈ ముఠా.. జగిత్యాల, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో దొంగతనాలు చేస్తున్నారు. ఇటీవల.. ఈ దొంగల ముఠాను జగిత్యాల పోలీసులు పట్టుకొని.. కోర్టుకు తరలించారు.. ముగ్గురు అరెస్టు చేసి వారి నుంచి.. బంగారం, నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.

Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..
Police Caught Thieves
G Sampath Kumar
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 23, 2025 | 6:07 PM

Share

జగిత్యాల జిల్లా పోలీసులు అంతరాష్ట్ర దొంగలను ముఠాను అరెస్టు చేశారు.  పథకం ప్రకారం దొంగతనాలు చేస్తూ.. బంగారం, నగదు కొల్లగొట్టడం వీరి స్టైల్. అయితే.. ఈ దొంగల ముఠాను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృంధాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో భాగంగా ముగ్గురు ముఠా సభ్యులు పోలీసులకు చిక్కారు.. అయితే.. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర హింగొలి జిల్లా బస్మత్ ప్రాంతానికి చెందిన మార్కులే అనిల్.. ఈ దొంగల ముఠాలో ప్రధాన నిందితుడు. ఇతడు.. పెద్ద గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. ఈ ముఠాలో మొత్తం.. పది మంది సభ్యులున్నారు. అనిల్.. పది మందిని నియమించుకొని.. వారికి జీతాలు ఇస్తున్నాడు. నెలకు ఇంత అని వారికి జీతాలు ఇస్తూ దొంగతనాలు చేయిస్తున్నాడు. మొత్తం సభ్యులను రెండు గ్యాంగులుగా విడగొట్టాడు. ఒక్కో గ్యాంగ్‌లో నలుగురు దొంగలతో పాటు, ఒక్కరు డ్రైవర్ ఉంటారు. వీరంతా.. నాలుగైదు రోజులకు ఒకసారి ఒక ప్రాంతాన్ని ఎంచుకుని చోరికి పాల్పడతారు.

దొంగతనం చేయడానికి ముందు.. వీళ్లంతా.. ముఖాలకు మాస్క్ పెట్టుకొని.. వివిధ ప్రాంతాలు తిరుగుతారు. తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తారు. తరువాత.. ఈ దొంగల ముఠా.. తాళాలు పగులగొట్టి.. దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎత్తుకెళ్లి అనిల్‌కి అప్పజెప్పుతారు.. తరువాత.. ఈ దొంగల ముఠాకు అతను కొన్ని డబ్బులు ఇస్తాడు. దీంతో.. వారంలో రెండు, మూడు దొంగతనాలు చేయడం వీరికి అలవాటుగా మారింది.. ఇటీవల కేసుల సంఖ్య పెరిగిపోవడంతో.. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. గాలింపును ముమ్మరం చేశారు. అందులో భాగంగా.. జగిత్యాల బైపాస్ రోడ్డులో ముగ్గురిని పట్టుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ఓ బాలుడుతో పాటు.. సాయినాథ్, శ్రీకాంత్ అనే దొంగలు ఉన్నారు. ఇంద్రవెళ్లికి చెందిన శ్రీకాంత్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

అయితే.. ప్రధాన నిందితుడు అనిల్ పరారీలో ఉన్నారు. ఈ దొంగ కోసం.. మరో మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి.. ముమ్మరంగా గాలిస్తున్నారు.. అయితే.. జీతాలు ఇచ్చి.. దొంగతనాలు చేయించడం అతని స్టైల్ అని పోలీసులు చెబుతున్నారు. వారికి.. నెల.. నెల డబ్బులు ఇవ్వడంతో.. దొంగతనం చేయడం అలవాటుగా మారిందట.. నిరుద్యోగంతో బాధపడుతున్న వారిని గుర్తించి.. ఈ దొంగల ముఠాలో చేర్పించుకుంటున్నాడు అనిల్. ప్రధాన నిందితుడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..