పట్టణం వీడి పల్లె బాట పట్టిన ఎమ్మెల్యే.. వినూత్నంగా వివాహ వార్షికోత్సవ వేడుకలు..!
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి రోజు ఎంతో ప్రత్యేకం.. వెడ్డింగ్ అనివర్సరీని ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. చాలామంది బంధువులు కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసుకుంటారు. కానీ ఓ ఎమ్మెల్యే మాత్రం తన వెడ్డింగ్ అనివర్సరీ ని వెరైటీగా జరుపుకున్నారు. ఆ వేడుకలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి రోజు ఎంతో ప్రత్యేకం.. వెడ్డింగ్ అనివర్సరీని ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. చాలామంది బంధువులు కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసుకుంటారు. కానీ ఓ ఎమ్మెల్యే మాత్రం తన వెడ్డింగ్ అనివర్సరీ ని వెరైటీగా జరుపుకున్నారు. ఆ వేడుకలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. లక్ష్మారెడ్డి-మాధవి దంపతులు సామాజిక సేవతో ప్రజాదరణ పొందారు. కష్టకాలంలో తన వెన్నంటి నడిచిన జీవిత భాగస్వామి ముచ్చటి తీర్చేందుకు ఆయన ఆదివాసి ఆచారాలతో వెరైటీగా పెళ్లిరోజు వేడుకలు జరుపుకోవాలని భావించారు. ఇంకేముంది తన 32వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి అడవి బాట పట్టారు.
విశాఖ సమీపంలోని ప్రకృతి రమణీయత కలిగిన అరకు ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలతో కలసి వివాహ వార్షికోత్సవ వేడుకలు వారి సాంప్రదాయ రీతిలో జరుపుకున్నారు. ఎమ్మెల్యే లాంటి వ్యక్తి తమ గూడేనికి రావడంతో తమ సాంప్రదాయ రీతిలో నృత్యాలు చేస్తూ వారికి ఘన స్వాగతం పలికారు. ఆదివాసి ఆచార సాంప్రదాయాల మేరకు వివాహ వార్షికోత్సవ వేడుకలను కనుల పండుగగా నిర్వహించారు. కాగా ఆ వీడియోను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఎమ్మెల్యే తీరుపై నేటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
