AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rythu Bandhu: తెలంగాణ రైతుల‌కు గుడ్ న్యూస్.. రైతు బంధు సాయం పంపిణీకి డేట్ పిక్స్

తెలంగాణ‌లో అన్న‌దాత‌ల‌కు గుడ్ న్యూస్ వ‌చ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు జూన్ 15 నుంచి రైతు బంధు సాయం పంపిణీ చేయనున్నారు.

Rythu Bandhu: తెలంగాణ రైతుల‌కు గుడ్ న్యూస్.. రైతు బంధు సాయం పంపిణీకి డేట్ పిక్స్
Telangana rythu bandhu
Ram Naramaneni
|

Updated on: May 29, 2021 | 8:34 PM

Share

తెలంగాణ‌లో అన్న‌దాత‌ల‌కు గుడ్ న్యూస్ వ‌చ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు జూన్ 15 నుంచి రైతు బంధు సాయం పంపిణీ చేయనున్నారు. జూన్ 25 లోగా రైతుల అకౌంట్ల‌లో నగదు జమ పూర్తి కానుంది. ఈ మేరకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యవసాయశాఖపై చేసిన రివ్యూ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. పార్ట్-బి నుంచి పార్ట్‌- ఏలోకి చేరిన రైతులకూ రైతు బంధు వర్తించనుంది. జూన్ 10 కటాఫ్ తేదీగా ఈ స్కీమ్ వర్తింపు ఉండనుంది. విత్తనాలు, ఎరువుల్లో కల్తీని అరికట్టాలని సమీక్ష సందర్భంగా ముఖ్య‌మంత్రి నిర్ణయించారు. కల్తీ నివారణకు అవసరమైన చట్ట సవరణ చేయాలని ఆయన అధికారులకు సూచించారు. అవసరమైతే ఆర్డినెన్స్ జారీ చేయాలన్నారు.

నూతన తెలంగాణ రాష్ట్రంలో ఆరునూరైనా వ్యవసాయ రంగాన్ని పునరుజ్జీవింప చేసి, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలనే సిద్దాంతంతో, వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. మిషన్ కాకతీయ తోపాటు, సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి కోటి ఎకరాల మాగాణాగా తెలంగాణను తీర్చిదిద్దడంలో విజయం సాధించామని, రాష్ట్ర వ్యవసాయ రంగ ముఖ చిత్రాన్ని గుణాత్మకంగా మార్చివేసామన్నారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ…‘‘ తెలంగాణ వ్యవసాయం ఎక్కడ ప్రారంభమైంది.. ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నదనే విషయాన్ని పరిశీలించినప్పుడు సంభ్రమాశ్చర్యం కలుగుతుంది. నీటికి కట కటలాడిన తెలంగాణలో నేడు 75 శాతం చెరువులు నదీ జలాలలతో నిండి వున్నయి. నడి ఎండాకాలంలో నిండుకుండలను తలపిస్తున్నవి. వొక్కవానపడితే చెరువులు అలుగులు దునకడానికి సిద్దంగా వున్నవి. రెండు పంటలకు కలిపి తెలంగాణలో నేడు కోటిన్నర టన్నుల ధాన్యాన్ని తెలంగాణ రైతు పండిస్తున్నారంటే మామూలు విషయం కాదు. పంజాబ్ కు సరిసమానంగా తెలంగాణ లో వరిధాన్యం దిగుబడి అవుతున్నది. అంతే ధాన్యాన్ని ఇవ్వాల ప్రభుత్వం వొక్క గింజను పోనియ్యకుంటా నేరుగా రైతు వద్దనుంచి కల్లాల్లోనే కొంటున్నది. కరోనా వంటి కష్ట కాలంలో దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే రైతునుంచి ధాన్యాన్ని కొంటున్నది. అందుకు మనం గర్వపడాలి’’ అని సిఎం అన్నారు.

Also Read:  న‌కిలీ విత్త‌నాల‌తో రైతుల‌ను ముంచితే, పీడి యాక్టులు.. తెలంగాణ పోలీసుల సీరియ‌స్ వార్నింగ్

బిర్యానీ ఆర్డ‌ర్ స‌రిగ్గా ఇవ్వ‌లేదంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేసిన నెటిజ‌న్.. మంత్రి రిప్లై భ‌లే ఫ‌న్నీ