Telangana: నవ్వుతూనే బాంబు పేల్చిన బాజిరెడ్డి.. అవాక్కైన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి..
ముందు నుండి కూడ బాజిరెడ్డి ఆర్మూరు రావాలని ప్రపోజల్ ఉంది...ప్రస్తుతం ఎమ్మెల్యే జీవన్ ను మార్చితే అది బాజిరెడ్డితో భర్తి చేస్తారు అనే ప్రచారం ఉంది... ఇప్పుడు ఈ కామెంట్స్ తో మరోసారి ఆ డిమాండ్ తెరపైకి వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.. అనేది పొలిటికల్ సర్కిల్స్ టాక్... అసలు సంబందం లేని సభలో బాజిరెడ్డి ఆ ప్రస్తవన ఏందుకు తెచ్చారు..
బాల్కొండ నియోజకవర్గంలో కాళేశ్వర జలాల స్వాగత కార్యక్రమం వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి వేసిన సెటైర్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది..ముప్కాల్ పంపు హౌజ్ నుండి ఎస్సారెస్పీ జలాశయంలోకి వరద కాలువ ద్వారా ఎదురెక్కి వచ్చిన కాళేశ్వరం జలాలను ఎస్పారెస్పిలోకి విడుదల చేసిన అనంతరం జరిగిన సభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. శుక్రవారం కాళేశ్వరం నుండి వచ్చిన నీటిని ముప్కాల్ పంప్ హౌస్ నుండి ఎస్పారెస్పికి విడుదల చేసారు ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారంతో పాటు మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపి సురేష్ రెడ్డి, ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు నిర్మల్ జిల్లా ఎమ్మెల్యేలు కూడ పాల్గోన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో జీవన్ రెడ్డి ముందు మాట్లడగా బాజిరెడ్డి తర్వాత మాట్లడారు.
బాజిరెడ్డి మాట్లడుతున్న క్రమంలో జీవన్ రెడ్డి పై చేసిన వాఖ్యలు అక్కడున్న వాళ్లందరిలో ఆసక్తిని రేపాయి. ఆర్మూరు నుండి వచ్చిన వాళ్లందరిని చూపిస్తూ గతంలో నేను కూడ ఇక్కడ ఎమ్మెల్యే గా చేశాను.. అంటూ తన గతన్ని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే…’జీవన్ నేను మళ్లి ఆర్మూరు రాను నువ్వేం భయపడకు, నేను అటే ఉంటా మళ్లీ నువ్వే గెలుస్తావ్ లే’ అంటూ వ్యాఖ్యానించారు బాజిరెడ్డి. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు ఏందుకు బాజిరెడ్డి ఇలా మాట్లాడరనే సందేహం ఇప్పుడు నియోజకవర్గంలో తీవ్ర చర్చకు దారి తీసింది…
1999 లో ఆర్మూరు ఎమ్మెల్యేగా బాజిరెడ్డి –
1999 లో బాజిరెడ్డి ఆర్మూరు ఎమ్మెల్యేగా పని చేసారు. అప్పటి నుండి ఆయనకు ఆ ప్రాంతంతో, అక్కడి ప్రజలతో మంచి సంబందాలు ఉన్నాయి. దీంతో ఇప్పటికి బాజిరెడ్డిని స్థానిక ప్రజలు ఓన్ చేసుకుంటారు. కానీ ఈ రోజు మళ్లీ అంత ప్రత్యేకంగా ఏందుకు పోటి గురించి ప్రస్తవించాల్సి వచ్చింది. అనే చర్చ ఇప్పుడు ఆర్మూరు హట్ టాఫిక్ గా మారింది…బాజిరెడ్డి ఆలోచన ఏంటి అనేదానిపై భిన్న ప్రచారం కూడ సాగుతుంది. గత కొంత కాలంగా బాజిరెడ్డికి జీవన్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉంది…గ్యాప్ తర్వాత తొలిసారి ఒకే వేదికపై కనిపించారు ఈ ఇద్దరు. దీంతో చాల రోజుల తర్వాత కలిసిన ఇద్దరి మధ్య ఈ చర్చ ఏందుకు వచ్చింది.. అని రాజకీయ నేతలు,ఆర్మూరు ప్రజలు చర్చించుకుంటున్నారు.
బాజిరెడ్డి కి ఆర్మూరు ప్రపోజల్ –
ముందు నుండి కూడ బాజిరెడ్డి ఆర్మూరు రావాలని ప్రపోజల్ ఉంది…ప్రస్తుతం ఎమ్మెల్యే జీవన్ ను మార్చితే అది బాజిరెడ్డితో భర్తి చేస్తారు అనే ప్రచారం ఉంది… ఇప్పుడు ఈ కామెంట్స్ తో మరోసారి ఆ డిమాండ్ తెరపైకి వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.. అనేది పొలిటికల్ సర్కిల్స్ టాక్… అసలు సంబందం లేని సభలో బాజిరెడ్డి ఆ ప్రస్తవన ఏందుకు తెచ్చారు.. మళ్లి నేను పోటి చేయను అని క్లారిటి ఏందుకు ఇచ్చారు ఇప్పుడు బిఆర్ఎస్ క్యాడర్ లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..