PM Modi in Telangana highlights: ‘కేసీఆర్ సర్కార్‌తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి..’ వరంగల్ సభలో ప్రధాని మోదీ..
PM Modi in Warangal highlights: ప్రధాని మోదీ తెలంగాణం సీఎం కేసీఆర్‌కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ కుటుంబం అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు గురిపెట్టాయన్నారు. స్కాంల నుంచి దృష్టి మరల్చడానికే కేసీఆర్ కొత్త నాటకాలనును తెరపైకి తెస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై..

PM Modi in Warangal highlights: ప్రధాని మోదీ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ కుటుంబం అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు గురిపెట్టాయన్నారు. స్కాంల నుంచి దృష్టి మరల్చడానికే కేసీఆర్ కొత్త నాటకాలనును తెరపైకి తెస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ‘భద్రాకాళీ అమ్మవారి మహత్యానికి, సమక్క-సారలమ్మ పౌరుషానికి, రాణి రుద్రమ పరాక్రమానికి ప్రఖ్యాతి గాంచిన వరంగల్‌కి రావడం సంతోషంగా ఉంది’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన అనంతరం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు.
ఒక్కమాటలో చెప్పాలంటే.. ఓరుగల్లు సభలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం ‘ఉదయం నుంచి సాయంత్రం వరకు మోదీని తిట్టడం.. కుటుంబ పార్టీని పెట్టి పోషించడం.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం.. తెలంగాణను అవినీతిలో కూరుకుపోయేలా చేయడం’ అనే నాలుగే పనులనే చేస్తోందంటూ సెటైర్లు వేశారు. ఇంకా దేశంలో అందరి కంటే అతిపెద్ద అవినీతి సర్కార్ కేసీఆర్‌దేన్ననారు మోదీ. ఆ అవినీతి ఢిల్లీదాకా విస్తరించిందని విమర్శించారు. అందుకే కేసీఆర్ కుటుంబం అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు గురిపెట్టాయన్నారు. కేసీఆర ప్రభుత్వం నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఏపీ అవినీతిలో పోటీపడుతున్నాయని మోదీ విమర్శించారు. అలాగు రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలవడం.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ తుడుచిపెట్టుకుపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మోదీ.
ప్రసంగం ప్రారంభంలో మోదీ.. ‘వరంగల్‌కు రావడం చాలా సంతోషంగా ఉంది. జన్‌సంఘ్ కాలం నుంచి వరంగల్ మాకు కంచుకోట. ఇవాళ్టి సభతో ఒక విషయం స్పష్టమైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం. 2021 వరంగల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ట్రైలర్ చూపించాం. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను బీజేపీ తుడిచిపెట్టేస్తుంది. తెలంగాణ జనం ఒక కుటుంబం కబంద హస్తాల్లో చిక్కుకుంది. రసత్వ పార్టీలంటేనే అవినీతిమయం. తెలంగాణకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ ప్రమాదమే. తెలంగాణ నుంచి ఆ రెండు పార్టీలనూ తరిమికొట్టాలి. 9ఏళ్లుగా తెలంగాణ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోంది. వేల సంఖ్యలో టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ్. పాఠశాల విద్యార్థులను కూడా కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ స్కామ్ అందరికీ తెలుసు. డబుల్ బెడ్రూం ఇళ్ళు కూడా కట్టించి ఇవ్వలేకపోయారు. రైతులకు చేస్తానన్న రుణమాఫీ ఊసే లేదు. తెలంగాణ ప్రభుత్వంపై సర్పంచ్‌లంతా ఆగ్రహంతో ఉన్నారు. ఇక్కడి గ్రామపంచాయితీలకు కేంద్రం వేలకోట్లు ఇచ్చింది’ అన్నారు.
LIVE NEWS & UPDATES
-
బీజేపీ అలా చేయదు..
దేశంలో, తెలంగాణలో కొన్ని పార్టీలు ఎన్నికలకు ముందు నుంచే అబద్దపు ప్రమాణాలు చేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ అలాంటి ప్రమాణాలు చేయదని, రేషన్ ఇస్తామని చెప్తే ప్రతి ఇంటికీ రేషన్ బియ్యం వచ్చి చేరుతున్నాయని, ఆయుష్మాన్ భారత్ ఇస్తామని చెప్తే దేశంలోని కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు.
-
‘కాంగ్రెస్, బీఆర్ఎస్‌తో జాగ్రత్తగా ఉండాలి’
కాంగ్రెస్, బీఆర్ఎస్‌తో జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. వరంగల్ వేదికగా జరుగుతున్న విజయ సంకల్ప సభలో ప్రసంగిస్తున్న ఆయన ‘కాంగ్రెస్ అవినీతిని దేశం మొత్తం చూసింది, బీఆర్ఎస్ అవినీతిని తెలంగాణ మొత్తం చూసింది. బీఆరెఎస్ అయినా, కాంగ్రెస్ అయినా తెలంగాణకు హానికరమే. ఈ రెండు పార్టీల నుంచి జాగ్రత్తగా ఉండాల’ని పేర్కొన్నారు.
-
-
‘బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది 4 పనులే’
తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగు పనులే చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ‘మొదటిది ఉదయం నుంచి సాయంత్రం వరకు మోదీని తిట్టడం. రెండోది కుటుంబ పార్టీని పెట్టి పోషించడం. మూడోది తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం. నాలుగో పని తెలంగానను అవినీతిలో కూరుకుపోయేలా చేయడం. తెలంగాణలో అవినీతి లేని ప్రాజెక్ట్ లేదు. వీళ్ల అవినీతి దేశస్థాయికి చేరింది’ అని వరంగల్ బీజేపీ విజయ సంకల్ప సభలో మోదీ పేర్కొన్నారు.
-
ఆరు నూరైనా రాష్ట్రంలో బీజేపీ గెలవాల్సిందే..
ఆరు నూరైనా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గెలవాల్సిందేనని హుజురాబాద్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ఎలెక్షన్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఏ నాటికీ ఒక్కటి కాదని, సీఎం కేసీఆర్‌ని గద్దె దించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
-
తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ..
వరంగల్ వేదికగా జరుగుతున్న బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ తెలుగులో తన ప్రసంగించారు. ‘భద్రాకాళీ అమ్మవారి మహత్యానికి, సమక్క-సారలమ్మ పౌరుషానికి, రాణి రుద్రమ పరాక్రమానికి ప్రఖ్యాతి గాంచిన వరంగల్‌కి రావడం సంతోషంగా ఉంది’ అంటూ తన ప్రసంగాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు.
-
-
బీఆర్ఎస్‌పై కిషన్ రెడ్డి విమర్శనాస్త్రాలు..
వరంగల్ హన్మకొండ వేదికగా జరుగుతున్న విజయ సంకల్ప సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఇంకా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేఅని, పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన చరిత్ర ఆ రెండు పార్టీలకు ఉందని.. బీజేపీకి అలాంటి చరిత్ర లేదని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రజాధనాన్ని దోపిడీ చేసి రాష్ట్రాన్ని దివాలా తీశాడని, తాము ఖచ్చితంగా కల్వకుంట్ల కుటుంబంపై పోరాడతామని, ఆ కుటుంబాన్ని ఫామ్ హౌస్‌కి పరిమితం చేస్తామన్నారు.
-
‘తెలంగాణ ప్రజలందరికీ నా అభినందనలు’
వరంగల్ పర్యటనలో ప్రధాని మోదీ ‘తెలంగాణ ప్రజలందరికీ నా అభినందనలు’ అంటూ తెలుగులో మాట్లాడారు. ఇంకా దేశ అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం ప్రముఖమైనదని, ఎన్నో పరిశ్రమలకు తెలంగాణ వేదికగా మారిందన్నారు.
-
మోదీ ప్రసంగంపై ఉత్కంఠ..
వరంగల్ భద్రాకాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభ సభాప్రాంగణానికి చేరుకున్నారు. అయితే ఆయన ఏమని ప్రసంగిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.అభివృద్ధి గురించి మాట్లాడతారా.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తారా..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
-
భద్రకాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు.
హైదరాబాద్ నుంచి నేరుగా వరంగల్ మామునూరు చేరుకున్న ప్రధాని మోదీ.. భద్రకాళీ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆర్ట్స్ కాలేజీ మైదానానికి చేరుకున్నారు.
-
వరంగల్‌లో కాలు మోపిన భారత ప్రధాని..
దాదాపు 30 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఓ భారత ప్రధాని ఓరుగల్లు భూమిపై కాలుమోపారు. వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు విచ్చేసిన ప్రధాని మోదీ కొద్ది సేపటి క్రితమే వరంగల్ మామునూరుకి చేరుకున్నారు. అనంతరం భద్రకాళీ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు.
-
రూ.6,109 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు..
ప్రధాని మోదీ శుక్రవారం ఓరుగల్లులో పర్యటించనున్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన రూ.6,109 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ క్రమంలోనే ప్రతిష్ఠాత్మక వ్యాగన్ తయారీ పరిశ్రమ, ఇంకా పలు జాతీయ రహదారులకు భూమి పూజ చేస్తారు. అనంతరం వరంగల్ వేదికగా జరిగే విజయ సంకల్పసభలో పాల్గొంటారు.
-
వరంగల్‌కు బయలుదేరిన ప్రధాని..
హైదరాబాద్ హకీంపేట్ ఎయిర్ పోర్ట్‌కు ప్రత్యేక విమానంలో చేరుకున్న ప్రధాని.. అక్కడి నుంచి కాసేపటి కిత్రమే వరంగల్ బయలు దేరారు. మరికాసేపట్లో వరంగల్‌లోని మామునూరు చేరుకోనున్నారు.
-
హకీం ఎయిర్ పోర్ట్ కుచేరుకున్న ప్రధాని..
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో ల్యాండ్ అయ్యారు. హకీం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న మోదీ కాసేపట్లో వరంగల్ బయలుదేరి వెళ్లనున్నారు.
Published On - Jul 08,2023 9:25 AM
