AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Lands : తెలంగాణలో భూముల డిజిటల్ సర్వేకు ఈ ఏడాది రూ . 400 కోట్లు, వివిధ కంపెనీలతో సీఎస్ ప్రాథమిక స్థాయి సమావేశం

భూముల డిజిటల్ సర్వేకు ఉపయోగించే పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, సర్వేకు పట్టే సమయం, అయ్యే వ్యయం, అందుబాటులో ఉన్న సర్వే పరికరాలు, సాంకేతిక నిపుణులు , కావాల్సిన సాఫ్ట్ వేర్..

TS Lands : తెలంగాణలో భూముల డిజిటల్ సర్వేకు ఈ ఏడాది రూ . 400 కోట్లు,  వివిధ కంపెనీలతో సీఎస్ ప్రాథమిక స్థాయి సమావేశం
Cs Somesh Kumar
Venkata Narayana
|

Updated on: Jun 01, 2021 | 5:03 PM

Share

Telangana Lands Digital Survey : రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వే చేపట్టడానికి ఈ సంవత్సరం బడ్జెట్ లో రూ.400 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు మంగళవారం బి.ఆర్.కె.ఆర్. భవన్ లో వివిధ కంపెనీలతో ప్రాథమిక స్థాయి సమావేశాన్ని ప్రధాన కార్యదర్శి నిర్వహించారు. భూముల డిజిటల్ సర్వే జరిపేందుకు ఆసక్తి వ్యక్తపరిచిన 17 కంపెనీలు ఈ చర్చలో పాల్గొన్నాయి. ఇతర రాష్ట్రాలలో నిర్వహించిన భూముల డిజిటల్ సర్వే సందర్భంగా తాము ఎదుర్కొన్న సమస్యల గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయా కంపెనీలు వివరించాయి. భూముల డిజిటల్ సర్వే పై ఆయా కంపెనీలతో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు త్వరలోనే సమావేశం నిర్వహించనున్నట్లు ప్రధాన కార్యదర్శి తెలిపారు. అలాగే భూముల డిజిటల్ సర్వేకు ఉపయోగించే పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, సర్వేకు పట్టే సమయం, అయ్యే వ్యయం, అందుబాటులో ఉన్న సర్వే పరికరాలు, సాంకేతిక నిపుణులు , కావాల్సిన సాఫ్ట్ వేర్ , హార్డ్ వేర్ , ఇంటర్నెట్ సామర్ధ్యం తదితర అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించారు.

ఈ సమావేశంలో ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ విభాగం కమిషనర్ అండ్ ఐ.జి. శేషాద్రి, టి.ఎస్‌.టి.ఎస్. ఎండి వెంకటేశ్వర్ రావు, సర్వే, సెటిల్మెంట్ & ల్యాండ్ రికార్డ్సు కమిషనర్ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.