COVID-19 Vaccination: కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్‌తోనే చెక్.. ఇప్పటివరకు ఎంతమందికి టీకా అందిందంటే..?

దేశంలో వ్యాక్సినేషన్ యజ్ఞంలా సాగుతోంది. వ్యాక్సిన్ వేయించుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం.. టీవీ9 నినాదం.. దేశం విధానం.

COVID-19 Vaccination: కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్‌తోనే చెక్.. ఇప్పటివరకు ఎంతమందికి టీకా అందిందంటే..?
Covid Vaccine
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 01, 2021 | 3:10 PM

COVID-19 Vaccination in India: దేశంలో వ్యాక్సినేషన్ యజ్ఞంలా సాగుతోంది. వ్యాక్సిన్ వేయించుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం.. టీవీ9 నినాదం.. దేశం విధానం. మరి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఎంత మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది? వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎంత మంది? దేశంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ఫుల్‌ డీటేల్స్ ఇప్పుడు చూద్దాం.

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 21 కోట్ల 23 లక్షల 52 వేల 536 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. అందులో 16 కోట్ల 88 లక్షల 98 వేల 336 మందికి మొదటి డోస్‌ వ్యాక్సిన్ అందగా.. 4 కోట్ల 34 లక్షల 54 వేల 200 మందికి రెండో డోస్‌ కూడా పూర్తైంది. ఇవాళ ఇప్పటి వరకు 7 లక్షల 20 వేల 229 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది.

Covid Vaccine

Covid Vaccine

తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు జనం. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 99 లక్షల 24 వేల 867 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. 74 లక్షల 8 వేల 750 మందికి మొదటి డోస్‌ అందగా.. 25 లక్షల 16 వేల 117 మందికి రెండో డోస్‌ కూడా పూర్తైంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 60 లక్షల 92 వేల 93 మందికి వ్యాక్సినేషన్ అందింది. అందులో మొదటి డోస్‌ పూర్తైన వారు 48 లక్షల 27 వేల 440 మంది. రెండో డోస్‌ పూర్తైన వారు 12 లక్షల 64 వేల 653 మంది ఉన్నారు.

ఇక ఏ కంపెనీ వ్యాక్సిన్లు ఎన్ని అందాయనే వివరాలు గమనిస్తే.. 18 కోట్ల 87 లక్షల 91 వేల 646 మందికి కోవిషీల్డ్ అందితే.. 2 కోట్ల 35 లక్షల 49 వేల 552 మందికి కోవాక్సిన్ టీకాలు అందాయి.

వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నంటున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దేశంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య 25 కోట్లకు చేరింది. ఆ వివరాలు చూస్తే.. 24 కోట్ల 99 లక్షల 47 వేల 449 మంది వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 9 కోట్ల 87 లక్షల 39 వేల 698 మంది.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య గ్రూప్ వారు అయితే.. 15 కోట్ల 13 లక్షల 7 వేల 750 మంది 45 ఏళ్ల పై బడిన వారు.

Covid Vaccine

Covid Vaccine

అందరికి వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. టీవీ9 నినాదం.. దేశం విధానం. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి..

Read Also..Corona Effect: కొలువులపై దెబ్బ కొడుతున్న కరోనా మహమ్మారి..రెండో వేవ్ లో కోటి మందికి పైగా ఉపాధి కోల్పోయారు