Corona Effect: కొలువులపై దెబ్బ కొడుతున్న కరోనా మహమ్మారి..రెండో వేవ్ లో కోటి మందికి పైగా ఉపాధి కోల్పోయారు
Corona Effect: కరోనా రెండో వేవ్ దేశంలో కోటి మందికి పైగా భారతీయుల ఉద్యోగాలు కోల్పోవటానికి దారితీసింది. 97% కంటే ఎక్కువ కుటుంబాల ఆదాయాలు క్షీణించాయి.
Corona Effect: కరోనా రెండో వేవ్ దేశంలో కోటి మందికి పైగా భారతీయుల ఉద్యోగాలు కోల్పోవటానికి దారితీసింది. 97% కంటే ఎక్కువ కుటుంబాల ఆదాయాలు క్షీణించాయి. ప్రైవేట్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) సిఇఒ మహేష్ వ్యాస్ ఈ విషయం చెప్పారు. గత ఏడాది దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా నిరుద్యోగిత రేటు మేలో రికార్డు స్థాయిలో 23.5 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం కరోనా రెండో వేవ్ సంక్రమణ తగ్గుతూ వస్తోందని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రాలు ఇప్పుడు క్రమంగా ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలను ఎత్తివేసే అవకాశం ఉంది. ఇది ఆర్థిక వ్యవస్థకు సహాయం చేస్తుంది. తద్వారా కొంతమందికి తిరిగి ఉద్యోగాలు దొరికే పరిస్థితి రావచ్చని వారు అంటున్నారు. ఆ నిపుణుల అంచనా ప్రకారం..
ఉద్యోగాలు కోల్పోయిన వారికి మళ్లీ ఉపాధి లభిస్తుంది. అసంఘటిత రంగంలో ఉద్యోగాలు త్వరలో ప్రారంభమవుతాయి. కాని వ్యవస్థీకృత రంగంలో నాణ్యమైన ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ఒక సంవత్సరం సమయం పడుతుంది. ఆర్థిక వ్యవస్థ క్రమేపీ తెరుచుకునేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది నిరుద్యోగ సమస్యను కొద్దిగా పరిష్కరిస్తుంది. కానీ, పూర్తిస్థాయిలో పరిష్కరించే అవకాశం మాత్రం లేదు. ప్రస్తుతం, మార్కెట్లో కార్మిక భాగస్వామ్య రేటు 40% కి పడిపోయింది. మహమ్మారికి ముందు ఈ రేటు 42.5%.
మన ఆర్థిక వ్యవస్థకు 3-4% నిరుద్యోగిత రేటు సాధారణమని వ్యాస్ అన్నారు. నిరుద్యోగిత రేటు మరింత తగ్గుతుంది. CMIE ఏప్రిల్‌లో 1.75 లక్షల కుటుంబాలపై దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. గత ఒక సంవత్సరంలో కలవార పెడుతున్న ఆదాయాల ధోరణిని ఈ సర్వే వెల్లడించింది. సర్వేలో, కేవలం 3% గృహాలు మాత్రమే తమ ఆదాయం పెరిగాయని, 55% మంది తమ ఆదాయం పడిపోయిందని చెప్పారు. మిగిలిన 42% మంది తమ ఆదాయంలో ఎటువంటి మార్పు లేదని చెప్పారు. దీనిని ద్రవ్యోల్బణం పరంగా లెక్కించినట్లయితే, 97% గృహాల ఆదాయం తగ్గినట్లుగా భావించవచ్చని వ్యాస్ చెబుతున్నారు.
కరోనా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా రోజువారీ కూలీ పనులు.. చిన్న చిన్న ఉద్యోగాలు అంటే దుకాణాలు, మెకానిక్ సెంటర్లు వంటి వాటిలో పనిచేసే వారి ఉపాధిపై పెను ప్రభావాన్ని చూపిస్తోంది. గత సంవత్సరం పూర్తి లాక్దౌన్ తో ఉపాధి కోల్పోయిన వారిలో చాలామందికి అన్ లాక్ పరిస్థితుల్లోనూ పని దొరకలేదు. ఇప్పుడు రెండో వేవ్ పరిస్థితుల్లో మళ్ళీకాస్త కుదుట పడుతున్న వారికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Also Read: Delta – Kappa: భారత్‌లో గుర్తించిన కరోనా వేరియంట్లకు కొత్త పేర్లు…ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన
White fungus : ఆంధ్రప్రదేశ్‌లో వైట్ ఫంగస్ కలకలం.. కర్నూలు జిల్లా వెలుగోడు మండలంలో వ్యాధి నిర్ధారణ