Coronavirus: తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. పిల్లల్లో వచ్చే కరోనాకు ఫ్లూ వ్యాక్సిన్ తో చెక్ పెట్టవచ్చు నంటున్న డాక్టర్లు
Coronavirus: చైనాలో 2019 లో చివరిలో వెలుగులోకి వచ్చిన కరోనా ప్రపంచాన్ని వణికించింది. ఈ వైరస్ రకరకాల రూపాలను సంతరించుకుంటూ ఇంకా అనేక దేశాల్లో తన ప్రభావం..
Coronavirus: చైనాలో 2019 లో చివరిలో వెలుగులోకి వచ్చిన కరోనా ప్రపంచాన్ని వణికించింది. ఈ వైరస్ రకరకాల రూపాలను సంతరించుకుంటూ ఇంకా అనేక దేశాల్లో తన ప్రభావం చూపుతూనే ఉంది. ఇక మన దేశంలో సెకండ్ వేవ్ విజృంభన ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తుంది. అయితే మరికొన్ని నెలల్లో థర్డ్ వేవ్ కల్లోలం సృష్టించనున్నదని.. దీని ప్రభావం ఎక్కువగా చిన్నారులపై ఉండనున్నదని ఎయిమ్స్ విద్య సిబ్బంది తెలిపింది. ఇప్పటి నుంచి తగిన విధంగా చర్యలు తీసుకోవాలంటూ ముందుగానే హెచ్చరికలను జారీ చేసింది. దీంతో తల్లిదండ్రుల్లో భయం మొదలైంది.
గతంలో కొవిడ్ వ్యాప్తి చెందినపుడు పిల్లలపై దీని ప్రభావం పెద్దగా ఉండదని భావించారు. మొదటి దశ కరోనా వ్యాపించినపుడు కేవలం 60 ఏళ్లు పైబడిన వారికి ప్రమాదకరంగా మారింది. సెకండ్ వేవ్‌లో దాదాపు అన్ని వయస్సు వారికీ సోకింది. అయితే సెకండ్ వేవ్ లో చాలా ప్రాంతాల్లో చిన్నారులు కోవిడ్ బారిన పడ్డారు. అదేవిధంగా రానున్న థర్డ్ వేవ్ ఎక్కువగా పిల్లపైనే ప్రభావం చూపనుందని తెలుస్తోంది. అయితే పిల్లల్లో రోగనిరోధక శక్తి ఉంటుంది కనుక వారు పూర్తిగా కోలుకుంటారన్న హామీ కూడా ఇవ్వలేమని పియాట్రిషన్ డాక్టర్స్ చెబుతున్నారు. పిల్లల్లో వైరస్ ప్రమాదకరంగా కాకముందే సరైన చర్యలు చేపట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
థర్డ్ వేవ్ లో పిల్లలను రక్షించడానికి ఐదేళ్లలోపు పిల్లలకు ప్రతి ఏడాది ఫ్లూ సంబంధిత టీకాలను ఇవ్వడం మంచిదని ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిషన్ (ఐఏపీ) సూచించింది. ఇటీవల అమెరికా మిచిగాన్ మిస్సోరీ నిర్వహించిన అధ్యయనంలో ఇనాక్టివేటెడ్ ఇన్‌ఫ్లూయెంజా టీకా 2019-20 మధ్య తీసుకున్న కొవిడ్ బారిన పిల్లలు కరోనా నుంచి త్వరగా కోలుకున్నారని తెలిపింది.
ఇప్పటికే మహారాష్ట్రలో కొన్ని జిల్లాల్లో భారీ సంఖ్యలో చిన్నారులు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పిడియాట్రిక్ టాస్క్‌ఫోర్స్ చిన్నారులు కరోనా నుంచి త్వరగా కోలుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. కొవిడ్ టీకా, ఇన్‌ఫ్లూయెంజా టీకా ఎపిటామిమోలాజిక్ క్లినికల్ ఫీచర్లు ఇంచుమించు దగ్గరగా ఉంటాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పిల్లలపై ప్రాణాంతకంగా మారకుండా ఉండడానికి ఫ్లూ కి సంబంధించిన వ్యాక్సినేషన్ ఇప్పించడం మంచిదని తెలిపింది. అదేవిధంగా ఇన్‌ఫ్లూయెంజా ఇన్ఫెక్షన్‌ను రాకుండా ఇప్పిండే టీకా ద్వారా కొవిడ్ వల్ల వచ్చే ఇన్ఫెక్షక్‌ను తగ్గించవచ్చని, ఆరోగ్య సంరక్షణ కూడా భారం కాకుండా ఉంటుందని సూచించింది. పిల్లల్లో ఇన్‌ఫ్లూయెంజా టీకా ద్వారా ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అది కరోనా వైరస్‌తో పోరాడటానికి కీలకపాత్ర పోషిస్తుంది.
అయితే ఈ వ్యాక్సినేషన్ తీసుకునే సమయంలో ఒక ముఖ్యమైన విషయం పాటించాలని… ఫ్లూ టీకా, కరోనా టీకా వేరువేరు.. ఈ రెండు టీకాలకు మధ్య దాదాపు నాలుగు వారాల సమయం ఉండాలని తెలిపింది. అప్పుడు పిల్లల్లో యాంటీబాడీస్ వృద్ధికి తోడ్పాడే సమయం ఉంటుంది. వైరస్‌లతో పోరాడటానికి సరిపడే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
Also Read: థర్డ్ వేవ్ పై స్పందించిన హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో తెలపాలంటూ ఆదేశాలు