AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 19: థర్డ్ వేవ్ పై స్పందించిన హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో తెలపాలంటూ ఆదేశాలు

దేశవ్యాప్తంగా ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాయి. తాజాగా తెలంగాణలో కరోనా పరిస్థితులపై..

Covid 19: థర్డ్ వేవ్ పై స్పందించిన హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో తెలపాలంటూ ఆదేశాలు
Surya Kala
|

Updated on: Jun 01, 2021 | 2:26 PM

Share

TS Highcourt-Covid 19: దేశవ్యాప్తంగా ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాయి. తాజాగా తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేసింది. సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం కరోనా విజృంభణ అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విచారణ చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తాము ఇచ్చిన ఆదేశాలోని కొన్నింటిని ఎందుకు అమలు చేయడం లేదని హైకోర్టు ప్రశ్నించింది.

కరోనా రోజులకు చికిత్సను అందించే ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సల ధరలు ఒకే విధంగా ఉండాలన్న ఆదేశాలు అమలు చేశారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతేకాదు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సల గరిష్ట ధరల సవరిస్తూ తాజా జీవో ఇచ్చారా.. కరోనా పై సలహా కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదు వంటి అనేక ప్రశ్నలను ప్రభుత్వానికి సంధించింది హైకోర్టు. రాష్ట్రంలో 14 కొత్త ఆర్ టీపీసీఆర్ లేబొరేటరీలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వ అధికారులను అడిగింది. కరోనా కోసం తాము ఇచ్చిన మరొకొన్ని ఆదేశాలను అమలు చేశారో లేదో నివేదికలో వివరించ లేదని తెలిపింది.

మరొకొన్ని నెలలలో థర్డ్ వేవ్ విజృంభించనున్నదని వైద్య సిబ్బంది హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా ముందస్తు చర్యలు తీసుకుంటుందో తెలపాలని కోరింది. అంతేకాదు..ఇప్పటికే మూడో దశ విజృంభనతో మహారాష్ట్రలో ఒకే జిల్లాలో 8 వేల మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారని తెలంగాణ హైకోర్టు గుర్తు చేసింది.

ప్రభుత్వం ఇచ్చిన మూడో దశ సన్నద్ధతపై వివరాలు సమగ్రంగా లేవని హైకోర్టు తెలిపింది. అన్ని భవిష్యత్తు లోనే చేస్తారా?, ఇప్పుడేమీ చేయడం లేదా … మూడో చిన్నారులపై ప్రభావం చూపుతుందని అంటున్న నేపథ్యంలో నిలోఫర్ ఆస్పత్రి ఒక్కటే సరిపోతుందా అంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చురకలు వేసింది. మౌలిక సదుపాయాలు, సిబ్బంది పెంపునకు ఏం చర్యలు తీసుకుంటున్నారని అడిగింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా చికిత్సలను అందిస్తున్న ఆస్పత్రుల లైసెన్సు రద్దు చేసిన విషయంపై స్పందిస్తూ.. ఆ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్న బాధితులు చెల్లించిన సొమ్ము తిరిగి ఇచ్చారా అని అధికారులను అడిగింది.

డీహెచ్ ఖమ్మం వెళ్లినందున హైకోర్టు లోని విచారణకు హాజరు కాలేదని ఏజీ బీఎస్ ప్రసాద్ ధర్మాసనానికి తెలిపారు. హైకోర్టు ప్రశ్నలకు వివరాలు అడిగి తెలుసుకునేందుకు సమయం ఇవ్వాలని ఏజీ కోరారు. కరోనా పరిస్థితులపై విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది.

Also Read:  ఆంజనేయునికి ఏయే పదార్ధాలతో అభిషేకాలు చేస్తే.. ఏయే ఫలితాలు కలుగుతాయంటే..!