పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా..
హైదరాబాద్ నగరంలోని రాజేందర్ నగర్ పీఎస్ పరిధిలో ప్రమాదం చోటుచేసుకుంది. పీవీ ఎక్స్‌ప్రెస్ వే బ్రిడ్జ్‌పై అదుపుతప్పి ఓ కారు బోల్తా కొట్టింది. మెహదీపట్నం నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు..
హైదరాబాద్ నగరంలోని రాజేందర్ నగర్ పీఎస్ పరిధిలో ప్రమాదం చోటుచేసుకుంది. పీవీ ఎక్స్‌ప్రెస్ వే బ్రిడ్జ్‌పై అదుపుతప్పి ఓ కారు బోల్తా కొట్టింది. మెహదీపట్నం నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు.. 170వ పిల్లర్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ హర్ష అగర్వాల్ తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డుపై కారు బోల్తా పడి ఉండటంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సహాయంతో కారును అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. గాయాలపాలైన కారు డ్రైవర్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు.