గుడి, మసీదుపై పడిన సచివాలయం పెచ్చులు.. సీఎం కేసీఆర్ విచారం

గుడి, మసీదుపై పడిన సచివాలయ శిథిలాలు పడటంపై ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. కూల్చివేత సందర్భంగా కొన్ని పెచ్చులు అక్కడున్న దేవాలయం, మసీదుపై పడ్డాయి. ఇలా జరగడం పట్ల....

  • Sanjay Kasula
  • Publish Date - 12:15 pm, Fri, 10 July 20
గుడి, మసీదుపై పడిన సచివాలయం పెచ్చులు.. సీఎం కేసీఆర్ విచారం

Secretariat Ruins on Temples and Mosque.. : గుడి, మసీదుపై పడిన సచివాలయ శిథిలాలు పడటంపై ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. కూల్చివేత సందర్భంగా కొన్ని పెచ్చులు అక్కడున్న దేవాలయం, మసీదుపై పడ్డాయి. ఇలా జరగడం పట్ల చింతిస్తున్నానన్నారు. ప్రభుత్వ ఉద్దేశ్యం పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడం… అంతే తప్ప మసీదు, దేవాలయాలను చెడగొట్టడం ప్రభుత్వ ఉద్దేశ్యం కాదన్నారు. సెక్రటేరియట్ ప్రాంతంలోనే కొత్తగా దేవాలయం, మసీదులను ఎన్ని కోట్లయినా సరే వెచ్చించి, పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో, విశాలంగా, సౌకర్యవంతంగా దేవాలయం, మసీదుల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతుందన్నారు. దీనికి సంబంధించి దేవాలయం, మసీదు నిర్వాహకులతో స్వయంగా తానే సమావేశమవుతానని.. వారి అభిప్రాయాల మేరకే ప్రభుత్వ నిర్మాణాలను చేపడుతుందని అన్నారు సీఎం కేసీఆర్.

‘‘సచివాలయంలో ఎత్తయిన భవనాలను కూల్చివేసే సందర్భంలో కొన్ని శిథిలాలు, పెచ్చులు దేవాలయం, మసీదులపై పడ్డాయి. దీనివల్ల వాటికి కొంత ఇబ్బంది కలిగింది. ఇది నాకు ఎంతో బాధ కలిగించింది. చాలా విచారకరం. ఇలా జరగడం పట్ల చింతిస్తున్నాను. ప్రభుత్వ ఉద్దేశ్యం పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడం. అంతే తప్ప మసీదు, దేవాలయాలను చెడగొట్టడం ప్రభుత్వ ఉద్దేశ్యం కాదు. సెక్రటేరియట్ ప్రాంతంలోనే కొత్తగా దేవాలయం, మసీదులను ఎన్ని కోట్లయినా సరే వెచ్చించి, పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తాం. ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో, విశాలంగా, సౌకర్యవంతంగా దేవాయలం, మసీదుల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతుంది. ’’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.