Breaking: ప్రభుత్వ ఆస్పత్రిలో శ్వాస అందక నలుగురు మృతి

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వా సుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి నలుగురు మృత్యువాతపడ్డారు. సరియైన సమయానికి ఆక్సిజన్ అందకపోవడం వల్లే చనిపోయినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Breaking: ప్రభుత్వ ఆస్పత్రిలో శ్వాస అందక నలుగురు మృతి
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 10, 2020 | 11:47 AM

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వా సుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి నలుగురు మృత్యువాతపడ్డారు. సరియైన సమయానికి ఆక్సిజన్ అందకపోవడం వల్లే చనిపోయినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో సకాలంలో ఆక్సిజన్‌ అందకపోవడంతో నలుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు కొవిడ్‌ బాధితులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌ విభాగంలోని ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సిలిండర్ అయిపోయాయి. దీంతో కొవిడ్‌ విభాగంలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ముగ్గురు, సాధారణ వార్డులో ఒకరు మృతి చెందారు. వీరంతా నిజామాబాద్‌ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న బాధితుల కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకుని ధర్నా చేపట్టారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందినట్లు మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసలు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ఆస్పత్రి సిబ్బంది నిరాకరించింది.