ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలో చెప్పిన సమంత
బయో ఎంజైములను కూడా తయారు చేసేస్తున్నారు సమంత. ఇంటిని శుభ్రపరచుకునేందుకు ఎటువంటి రసాయనాలను వాడకుండా వీటితోనే చేసుకోవచ్చని ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనికి...
Samantha.. Cleane at Home The Natural Way : అక్కినేని వారి కోడలు సమంత టైమ్ ను సరిగ్గా వినియోగించుకుంటారు. సమయపాలన విషయంలోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటారు. లాక్ డౌన్‌తో షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో సమంత ఇంట్లోనే బిజీగా ఉంటున్నారు. కుటుంబ సభ్యులతో తెగ సరదాగా గడుపుతున్నారు.
చైతుకు స్వయంగా వండి పెట్టాలని ప్రముఖ చెఫ్ దగ్గర శిక్షణ తీసుకున్నారు.. అంతేకాదు… ఇంటి టెర్ర్‌స్ పై ఆర్గానిక్ వ్యవసాయం చేయడం, పోషక విలువలున్న వంటలు చేయడం బాగా నేర్చుకున్నారు. వీటన్నింటినీ.. తన ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.
అంతటితో ఆగలేదుగా సమంత. బయో ఎంజైములను కూడా తయారు చేసేస్తున్నది. ఇంటిని శుభ్రపరచుకునేందుకు ఎటువంటి రసాయనాలను వాడకుండా వీటితోనే చేసుకోవచ్చని ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది. ఇది అద్భుతమైన ఐడియా అంటూ అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మరింకొందరు ఫ్యాన్ అయితే ఈ ఐడియాను మార్కెట్ చేయాలంటూ బిజినెస్ సలహాలు కూడా ఇస్తున్నారు.