నాగార్జున సాగర్ ఘటనపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
నాగార్జున సాగర్ ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఇది కేవలం వ్యూహాత్మకమైన చర్యగా అభివర్ణించారు. నాగార్జున సాగర్ ఎక్కడికీపోదు, ఆ గేట్లు ఎక్కడికీ పోవు, నీళ్లు అక్కడే ఉంటాయని వివరించారు. తెల్లవారు ఝామున పోలింగ్ ప్రారంభమయ్యే కొన్ని గంటల ముందు ఇలాంటి అంశాలకు తెర లేపుతున్నారంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.
నాగార్జున సాగర్ ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఇది కేవలం వ్యూహాత్మకమైన చర్యగా అభివర్ణించారు. నాగార్జున సాగర్ ఎక్కడికీపోదు, ఆ గేట్లు ఎక్కడికీ పోవు, నీళ్లు అక్కడే ఉంటాయని వివరించారు. తెల్లవారు ఝామున పోలింగ్ ప్రారంభమయ్యే కొన్ని గంటల ముందు ఇలాంటి అంశాలకు తెర లేపుతున్నారంటే తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తితో సంయమనం పాటించాలని కోరారు. ఇప్పుడు ఎవరు, ఎందుకు, ఎలాంటి ప్రయోజనాలు ఆశించి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారో కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోందన్నారు. దీనిపై ఎన్నికల అధికారులు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
గడిచిన తొమ్మిదేళ్లుగా ఈ సమస్యను పరిష్కరించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. తమ ప్రభుత్వం వస్తుందని ఆప్పుడు దీనిపై సరైన పరిష్కారం చూపుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత నీళ్ళకు సంబంధించి ఏ రాష్ట్ర సమస్యనైనా పరిష్కరిస్తామన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలను ఊటంకించారు. ఈ నీటి సమస్యను సామరస్య పూర్వకంగా ఇద్దరికీ ఉపయోగకరంగా ఉండేలా పరిష్కరించుకుంటామన్నారు. పాకిస్తాన్, భారత్‌లే నీటిని పంచుకుంటున్నాయని రెండు దేశాలే నీటి విషయంలో సామరస్యంగా పోతుంటే రాష్ట్రాలు నీటిని పంచుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..
పోలింగ్ లైవ్ వీడియో కోసం కింద క్లిక్ చేయండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..