Telangana Elections 2023: పోలింగ్ బూత్‌ల వద్ద ఘర్షణలు.. చెదరగొడుతున్న పోలీసులు
జిల్లాలోని కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పొలింగ్ బూత్ దగ్గర కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇందులో కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. అలాగే నిర్మల్ జిల్లా భైంసాలో ఓటు వేసేందుకు కొందరు కాషాయ కండువాలతో రాగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ కండువాలు లేకుండా ఓటువేయాలని పోలీసులు స్పష్టం చేయడంతో..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుండగా, అక్కడక్కడ చిన్నపాటి ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 7.78 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే నాగర్‌కర్నూల్ లోని అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో పోలింగ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కలుగజేసుకుని ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.
ఖమ్మం జిల్లాలో.. జిల్లాలోని కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పొలింగ్ బూత్ దగ్గర కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇందులో కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. అలాగే నిర్మల్ జిల్లా భైంసాలో ఓటు వేసేందుకు కొందరు కాషాయ కండువాలతో రాగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ కండువాలు లేకుండా ఓటువేయాలని పోలీసులు స్పష్టం చేయడంతో పోలీసులతో వారు కొంత సేపు వాగ్వివాదానికి దిగారు.
ఇబ్రహీంపట్నంలో.. ఇక ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఖానాపూర్‌లో కూడా పోలింగ్ బూత్ వద్ద బీఆర్‌ఎస్-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
జనగామలో.. పోలింగ్ సందర్భంగా జనగామలో కాసేపు ఉద్రికత్త నెలకొంది. పట్టణంలోని 244 బూత్ దగ్గరకు బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు చేరుకోవడంతో అక్కడ ఘర్షణ చోటు చేసుకుంది. రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అయితే పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టడంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇదిలా ఉండగా, అక్కడక్కడ చిన్నపాటి ఘర్షణలు తప్ప మిగితా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..