AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather News: మండుతున్న ఎండలు.. కూల్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ

ఎండలు మండుతున్న టైంలో కూల్‌ న్యూస్‌ చెప్పింది ఐఎండీ. హీట్‌ వేవ్‌ తగ్గుతోందని, చాలాచోట్ల వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని వెల్లడించింది.

Weather News: మండుతున్న ఎండలు.. కూల్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ
Weather Update
Ram Naramaneni
|

Updated on: May 02, 2022 | 8:26 AM

Share

దేశవ్యాప్తంగా ఎండలు మామూలుగా లేవు. అధిక ఉష్ణోగ్రతలు, విద్యుత్​సంక్షోభంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అటు హీట్​వేవ్​ ఎఫెక్ట్‌తో అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోతోంది. ఈ టైంలో ప్రజలకు గుడ్‌న్యూస్ ​చెప్పింది భారత వాతావరణశాఖ. ఢిల్లీ(Delhi), వాయువ్య-మధ్య భారతంలో ఇవాళ్టి నుంచి హీట్‌వేవ్ ​తగ్గుముఖం పడుతుందని వెల్లడించింది ఐఎండీ(IMD). హీట్‌వేవ్​ తగ్గడంతో పాటు, ఢిల్లీ, హిమాచల్​ప్రదేశ్, పంజాబ్(Punjab), హరియాణా, ఛండీగఢ్​, తూర్పురాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. మే 3 తర్వాత తెలంగాణ(Telangana), మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్‌లో హీట్‌వేవ్ ​తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తోంది ఐఎండీ. హీట్‌వేవ్​ నేపథ్యంలో ఏప్రిల్ ​నెలలో ఉష్ణోగ్రతలు రికార్డుల మోత మోగించాయి. వాయువ్య భారతం, మధ్య భారతంలో ఉష్ణోగ్రతలు సగటున 35.90 డిగ్రీలు, 37.78 డిగ్రీలు నమోదయ్యాయి. 122 ఏళ్లలో ఇదే గరిష్ఠం. అటు అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ డిమాండ్​భారీగా పెరిగిందని, ఫలితంగా దేశంలో పవర్​కట్‌లు పెరిగాయని చెబుతున్నారు నిపుణులు. వేసవి కాలంలో సాధారణంగా మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ, ఈసారి మార్చి నుంచే భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే, ఇటీవల అప్పుడప్పుడు వర్షాలు కురవడంతో, తెలుగు రాష్ట్రాల ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. కానీ, మే నెలలో ఎండలు ఎలా ఉంటాయోననే భయం స్టార్ట్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో హీట్‌వేవ్‌ తగ్గుతుందని ప్రకటించింది వాతావరణ శాఖ.

Also Read: Brain Teaser: ఏంటీ మాయాజాలం.. ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే.. మీ చూపుల్లో పదునున్నట్లే..!