జీఎస్టీ ఎఫెక్ట్: తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్‌ ధరలకు రెక్కలు!

తెలంగాణ ప్రజలకు బ్యాడ్ న్యూస్ చెబుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూముల రిజిస్ట్రేషన్ ధరలను పెంచనుంది ప్రభుత్వం. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే కసరత్తులు కూడా ప్రారంభించిందట. కేంద్ర కేబినేట్‌లో జీఎస్టీపై జరిగిన సమావేశంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. ప్రజలపై ఎక్కువగా భారం పడకుండా.. సామరస్యంగా ప్రతిపాదనలు పంపాలని ఆయన ఆదేశించారు. అలాగే.. బిల్డర్ల భూముల రిజిస్ట్రేషన్ విలువల సవరణ అంశం […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:42 am, Thu, 19 December 19
జీఎస్టీ ఎఫెక్ట్: తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్‌ ధరలకు రెక్కలు!

తెలంగాణ ప్రజలకు బ్యాడ్ న్యూస్ చెబుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూముల రిజిస్ట్రేషన్ ధరలను పెంచనుంది ప్రభుత్వం. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే కసరత్తులు కూడా ప్రారంభించిందట. కేంద్ర కేబినేట్‌లో జీఎస్టీపై జరిగిన సమావేశంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. ప్రజలపై ఎక్కువగా భారం పడకుండా.. సామరస్యంగా ప్రతిపాదనలు పంపాలని ఆయన ఆదేశించారు. అలాగే.. బిల్డర్ల భూముల రిజిస్ట్రేషన్ విలువల సవరణ అంశం కూడా చర్చకు రావడంతో ఈ ప్రక్రియ ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారం రోజుల్లోనే భూముల రిజిస్ట్రేషన్ విలువలు సవరించే అవకాశముంది.

కాగా.. ఈ భూముల రిజిస్ట్రేషనల్ ధరలు సవరించి ఇప్పటికి దాదాపు ఏడేళ్లు కావొస్తోంది. 2013 ఆగష్టులో రిజిస్ట్రేషన్ విలువల సవరణ జరిగింది. మళ్లీ ఇంతవరకూ జరగకపోవడంతో.. రిజిస్ట్రేషన్ ధరలకు, మార్కెట్ ధరలకు పొంతన లేకుండా పోయింది. ఉదాహరణకు.. ఉప్పల్ భగాయత్‌లో ఇటీలవ భూముల వేలం జరగ్గా.. గజం రూ. 79 వేలకు పలుకగా.. అక్కడ రిజిస్ట్రేషన్ ధర మాత్రం రూ.7 వేలు మాత్రమే. వ్యవసాయ భూములకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో.. రిజిస్ట్రేషన్ విలువలను సవరించడం అనివార్యంగా కనిపిస్తోంది.