AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దొంగగా మారిన బీటెక్‌ విద్యార్థి..చివరకు అలా

చెడు అలవాట్లు, వ్యసనాలకు అలవాటు పడిన బీటెక్‌ విద్యార్థి..ప్రేమించిన యువతి కోసం దొంగగా మారాడు. చివరకు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కొత్తపల్లి మండలం అస్నాయ్‌ గ్రామానికి చెందిన అజ్మీరా లక్ష్మణ్‌ అనే విద్యార్థి మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎం. ఫార్మసీ చదువుతున్నాడు. ఉప్పల్‌ విజయపురి కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. గత కొన్ని రోజులుగా […]

దొంగగా మారిన బీటెక్‌ విద్యార్థి..చివరకు అలా
Pardhasaradhi Peri
|

Updated on: Dec 18, 2019 | 7:28 PM

Share
చెడు అలవాట్లు, వ్యసనాలకు అలవాటు పడిన బీటెక్‌ విద్యార్థి..ప్రేమించిన యువతి కోసం దొంగగా మారాడు. చివరకు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కొత్తపల్లి మండలం అస్నాయ్‌ గ్రామానికి చెందిన అజ్మీరా లక్ష్మణ్‌ అనే విద్యార్థి మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎం. ఫార్మసీ చదువుతున్నాడు. ఉప్పల్‌ విజయపురి కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. గత కొన్ని రోజులుగా ప్రేమించిన అమ్మాయితో జల్సాలు చేస్తూ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు.
డబ్బుల కోసం దొంగతనాలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఘట్‌కేసర్‌, మేడిపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఇంజనీరింగ్‌ కాలేజీలో పరీక్షల సమయంలో విద్యార్థులు పార్క్‌ చేసిన స్కూటీల డిక్కీలు తెరిచి సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లడం ప్రారంభించాడు. అందులో భాగంగానే నారపల్లిలోని నల్ల మల్లారెడ్డి కళాశాల ఆవరణలో టూవీలర్‌ వెహికిల్‌లో ఉన్న మొబైల్‌ ఫోన్లు చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా లక్ష్మణ్ను అరెస్టు చేశారు. అనంతరం నిందితుడి నుంచి 20 మొబైల్‌ ఫోన్లు, 2 ల్యాప్ టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి తెలిపారు. గతంలో ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనూ చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు.

Follow Us
ఏసీలు ఎందుకు పేలుతాయో తెలుసా..?
ఏసీలు ఎందుకు పేలుతాయో తెలుసా..?
నీళ్లు ఎక్కువున్న కొబ్బరి బోండాన్ని ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా..
నీళ్లు ఎక్కువున్న కొబ్బరి బోండాన్ని ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా..
కొత్త స్కీమ్‌కు కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌!
కొత్త స్కీమ్‌కు కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌!
'ధురంధర్'లోని యలీనా జమాలీ పాత్ర నిజమేనా? ఇప్పటికీ ఆమె బతికే ఉందా?
'ధురంధర్'లోని యలీనా జమాలీ పాత్ర నిజమేనా? ఇప్పటికీ ఆమె బతికే ఉందా?
మేష రాశిలోకి శుక్రుడు..వారికి ధన యోగాలు, రాజ యోగాలు..!
మేష రాశిలోకి శుక్రుడు..వారికి ధన యోగాలు, రాజ యోగాలు..!
మీ ఇంటికే భద్రాచలం సీతారాముల కళ్యాణ తలంబ్రాలు.. ఆర్డర్ చేస్తే..
మీ ఇంటికే భద్రాచలం సీతారాముల కళ్యాణ తలంబ్రాలు.. ఆర్డర్ చేస్తే..
ధనవంతులవ్వాలా? చాణక్యుని ఈ 8 పవర్‌ఫుల్ రూల్స్ ఫాలో అవ్వండి!
ధనవంతులవ్వాలా? చాణక్యుని ఈ 8 పవర్‌ఫుల్ రూల్స్ ఫాలో అవ్వండి!
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఆ రోల్ నేను చేయాల్సింది..
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఆ రోల్ నేను చేయాల్సింది..
60 ఏళ్ల తర్వాత.. వారికి విముక్తి.. చిటికేస్తే దిగొచ్చి పడతాయ్
60 ఏళ్ల తర్వాత.. వారికి విముక్తి.. చిటికేస్తే దిగొచ్చి పడతాయ్
అక్కడ ఉచితాల వేలం మొదలు.. తొలి విడతగా ఇంటింటికి రిఫ్రిజిరేటర్..
అక్కడ ఉచితాల వేలం మొదలు.. తొలి విడతగా ఇంటింటికి రిఫ్రిజిరేటర్..