AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రైస్తవ సోదరులకు గ్రాండ్‌గా ‘సీఎం డిన్నర్’

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. వీటి నిర్వహణకు అదనంగా రూ.33 కోట్లను కేటాయించారు. ఈ నెల 20న క్రైస్తవ సోదరులకు తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రాండ్‌గా క్రిస్మస్ విందు ఇవ్వనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో ఈ విందును ఏర్పాటు చేశారు సీఎం. కాగా.. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు కూడా పాల్గొననున్నారు. ఈ విందుకు దాదాపు 10 వేల మంది క్రైస్తవులు హాజరుకానున్నారని సమాచారం. అలాగే.. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు లక్షల క్రైస్తవ […]

క్రైస్తవ సోదరులకు గ్రాండ్‌గా 'సీఎం డిన్నర్'
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 19, 2019 | 12:23 PM

Share

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. వీటి నిర్వహణకు అదనంగా రూ.33 కోట్లను కేటాయించారు. ఈ నెల 20న క్రైస్తవ సోదరులకు తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రాండ్‌గా క్రిస్మస్ విందు ఇవ్వనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో ఈ విందును ఏర్పాటు చేశారు సీఎం. కాగా.. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు కూడా పాల్గొననున్నారు. ఈ విందుకు దాదాపు 10 వేల మంది క్రైస్తవులు హాజరుకానున్నారని సమాచారం. అలాగే.. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు లక్షల క్రైస్తవ కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఇప్పటికే పలు చర్చీల్లో దుస్తుల పంపిణీ జరుగుతోంది.