వీణావాణీలకు టెన్త్ ఎగ్జామ్స్..! హాల్ టికెట్స్ ఒకటా..? రెండా..?
అవిభక్త కవలలు వీణా వాణీలు వచ్చే మార్చిలో పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. అయితే, వీరి ఎగ్జామ్స్..ఇప్పుడు పాఠశాల విద్యాశాఖకే కొత్త పరీక్ష పెట్టింది. పదో తరగతి పరీక్షలు రాస్తున్న వీరికి ఒకే హాల్‌టికెట్ ఇవ్వాలా ? లేదా రెండు కేటాయించాలా ? అని పాఠశాల విద్యాశాఖ సందేహాం వ్యక్తం చేసింది. అనేక మల్లగుల్లాల తర్వాత పాఠశాల విద్యాశాఖ కమిషన్, వైద్యారోగ్య శాఖ అధికారులను సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చారు.మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వీరిశెట్టి గ్రామానికి […]
అవిభక్త కవలలు వీణా వాణీలు వచ్చే మార్చిలో పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. అయితే, వీరి ఎగ్జామ్స్..ఇప్పుడు పాఠశాల విద్యాశాఖకే కొత్త పరీక్ష పెట్టింది. పదో తరగతి పరీక్షలు రాస్తున్న వీరికి ఒకే హాల్‌టికెట్ ఇవ్వాలా ? లేదా రెండు కేటాయించాలా ? అని పాఠశాల విద్యాశాఖ సందేహాం వ్యక్తం చేసింది. అనేక మల్లగుల్లాల తర్వాత పాఠశాల విద్యాశాఖ కమిషన్, వైద్యారోగ్య శాఖ అధికారులను సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చారు.మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వీరిశెట్టి గ్రామానికి చెందిన వీణావాణీలు 2003 అక్టోబర్ 16న జన్మించారు. ఇక అప్పట్నుంచి ఈ కవలలు.. ప్రపంచ వైద్యుల ముందు అనేక సవాళ్లను ఉంచారు. పుట్టినప్పుడే ఇద్దరి తలలు రెండు విడదీయలేనంతగా అతుక్కుని ఉన్నాయి. వీరిద్దరిని భౌతికంగా వేరు చేసేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో పుట్టినప్పటి నుండి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి, ఆ తర్వాత హైదరాబాద్ నిలోఫర్‌లో వైద్య చికిత్సలు పొందుతూ వచ్చారు. ఆస్పత్రుల్లో ఉంటూనే ఇద్దరూ తమ చదువును కొనసాగించారు. 2017 జనవరి నుంచి హైదరాబాద్ వెంగళరావునగర్ స్టేట్ హోంలోని బాలసదన్‌లో ఉంటున్నారు. కాగా, ఈ ఏడాది మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు. వెంగళరావు నగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వీణావాణీలకు పదో తరగతిలో ప్రవేశాలు కల్పించారు. కానీ ఈ కవలల విషయంలో వైద్యపరంగా డాక్టర్లకు ఎదురైన సమస్యే.. ఇటు విద్యాపరంగాను అధికారులకు ఎదురైంది. టెన్త్ పరీక్షలు రాసేందుకు అవిభక్త కవలలైన వీణావాణీలకు ఒకే హాల్ టికెట్ ఇవ్వాలా.. లేదా రెండు హాల్ టికెట్లు ఇవ్వాలా అనే గందరగోళంలో పడ్డారు అధికారులు.
వీణావాణీలు ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షలు రాయాల్సి ఉండటంతో.. వారి విద్యా సామర్థ్యాన్ని విశ్లేషించేందుకు మహిళా సంక్షేమ శాఖ ఓ కమిటీని నియమించింది. ముగ్గురు సభ్యులు కలిగిన ఈ కమిటీ.. అవిభక్త కవలలు ఐనప్పటికీ వీణావాణీల ఆలోచనలు వేర్వేరుగా ఉన్నాయని తేల్చింది. ప్రభుత్వ పరీక్షలు రాసే సామర్థ్యం, అర్హతతోపాటు వయసు సమస్య కూడా లేదని చెప్పింది. దీంతో కమిటీ నివేదిక ప్రకారం.. వారిద్దరికీ విడివిడిగా హాల్‌టికెట్ ఇస్తామని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి వెంట నర్సమ్మ తెలిపారు. విద్యాశాఖ కమిషనర్ అదేశాల మేరకు అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. మార్చిలో జరగనున్న పదోతరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న వీణావాణీలకు ఆల్‌ది బెస్ట్..