తెలంగాణకూ 3 రాజధానులు… ఎవరన్నారంటే?
ఏపీలో మూడు రాజధానుల అంశం అతిపెద్ద చర్చనీయాంశమైంది. విశాఖ, కర్నూలు, అమరావతిలలో మూడు ప్రధాన విభాగాలను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రకటన 13 జిల్లాను కుదిపేస్తోంది. 90 శాతం జగన్ ప్రకటనను స్వాగతిస్తుండగా.. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జగన్ ప్రకటనను బిజెపి నేతలు పాక్షికంగా స్వాగతించగా.. తెలుగుదేశం, జనసేనపార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఇదే డిమాండ్ ఇప్పుడు తెలంగాణకు విస్తరించే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో తరహాలోనే తెలంగాణకు మూడు రాజధానులు […]
ఏపీలో మూడు రాజధానుల అంశం అతిపెద్ద చర్చనీయాంశమైంది. విశాఖ, కర్నూలు, అమరావతిలలో మూడు ప్రధాన విభాగాలను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రకటన 13 జిల్లాను కుదిపేస్తోంది. 90 శాతం జగన్ ప్రకటనను స్వాగతిస్తుండగా.. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జగన్ ప్రకటనను బిజెపి నేతలు పాక్షికంగా స్వాగతించగా.. తెలుగుదేశం, జనసేనపార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఇదే డిమాండ్ ఇప్పుడు తెలంగాణకు విస్తరించే పరిస్థితి కనిపిస్తోంది.
ఏపీలో తరహాలోనే తెలంగాణకు మూడు రాజధానులు అవసరమంటున్నారు బిజెపి ఎంపీ సోయం బాపూరావు. హైదరాబాద్ కేంద్రంగానే మొత్తం అభివృద్ధి జరగడం అంత శ్రేయస్కరం కాదని చెబుతున్నారాయన. అదిలాబాద్ వంటి పట్టణాలు హైదరాబాద్‌కు సూదూరంలో వున్నాయని, దాంతో అక్కడ అభివృద్ధి అంతంత మాత్రంగానే వుందని బాపూరావు అంటున్నారు. అదిలాబాద్‌లో శాసనసభ, శాసనమండలి ఏర్పాటు చేసి, సంవత్సరంలో ఒకటి, రెండు సార్లు సభా సమావేశాలు నిర్వహిస్తే.. అదిలాబాద్ బాగా డెవలప్ అవుతుందని అంటున్నారాయన.
తెలంగాణాలో మూడు రాజధానులు ఏర్పాటు చేసి, అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో జరిగేట్లు చూడాలని బిజెపి ఎంపీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. హైదరాబాద్, అదిలాబాద్, వరంగల్.. ఇలా మూడు రాజధానులను ఏర్పాటు చేయాల్సి వుందన్నది బాపూరావు సూచన. అయితే బాపూరావు ప్రకటనపై మరే ఇతర బిజెపి నేతల స్పందించలేదు. దాంతో ఇది ఆయన వ్యక్తిగత ప్రకటనేనని భావిస్తున్నారు పరిశీలకులు.