Himayat Sagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేట్లు ఎత్తిన అధికారులు..

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Jul 20, 2021 | 5:21 PM

హిమాయత్‌ సాగర్ గేట్లు తెరుచుకున్నాయి. హైదరాబాద్ జంట జలాశయాలు పూర్తిస్థాయిలో నీటితో నిండిపోయాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ హిమాయత్ సాగర్‌కు భారీగా వరద నీరు చేరింది.

Himayat Sagar: నిండుకుండలా హిమాయత్ సాగర్..  గేట్లు ఎత్తిన అధికారులు..
Himayat Sagar Gates

హిమాయత్‌ సాగర్ గేట్లు తెరుచుకున్నాయి. హైదరాబాద్ జంట జలాశయాలు పూర్తిస్థాయిలో నీటితో నిండిపోయాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ హిమాయత్ సాగర్‌కు భారీగా వరద నీరు చేరింది. ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ అధికారులతో కలిసి ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేశారు.   జలాశయం చుట్టుపక్కల ప్రాంతాల్లో గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు పడటంతో ఆమ్లా పూర్ వాగు నుంచి ఒక్కసారిగా వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నదిలోకి నీటిని విడుదల చేస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

దీంతో సాగర్‌ పరిసర ప్రాంతాలను రాజేంద్రనగర్‌ పోలీసులు పరిశీలించారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు హిమాయత్‌సాగర్‌కి రావొద్దని లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ దిగువ గ్రామాల్లో చాటింపు వేశారు. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. హిమాయత్ సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1762.90 అడుగులకు చేరింది.

ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1250 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది. ఉస్మాన్‌సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1784.60 అడుగులకు చేరింది. మూసి నదీ పరివాహక ప్రాంతాలైన కిస్మత్ పూర్, బండ్లగూడ, హైదర్ గూడా, లంగర్ హౌస్, కార్వాన్ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు అధికారులు తెలిపారు.

పదేళ్ల తర్వాత హిమాయత్ సాగర్ నిండింది. ఈ జలాశయం నిండుగా ఉండటంతో హైదరాబాద్‌ వాసుల తాగునీటికి ఇక ఇబ్బందులు ఉండవు. మరోవైపు – రెండు రోజులుగా కురుస్తున్న కుంభవృష్టికి హుస్సేన్‌సాగర్‌ నిండిపోయింది. దీంతో సాగర్‌లోని నీటిని అధికారులు గేట్ల ద్వారా బయటకు విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి: CM Jagan: మరో వారం రోజుల పాటు నైట్‌ కర్ఫ్యూ.. క్లారిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి

Farmers Profit: రైతులకు మరో గుడ్ న్యూస్.. వరిగడ్డిని బంగారంగా మార్చే గోల్డెన్ ప్లాన్..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu