AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramappa Temple: ‘రామప్ప’కు కీర్తి దక్కింది.. ఇప్పుడు క్రెడిట్ పంచాయతీ మొదలయ్యింది…

2020 ఏడాదికి గాను రామప్పకు ఈ హోదా దక్కింది. 2021 ఏడాది నామినీగా గుజరాత్‌కి చెందిన ధోలవీర ఆలయం వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ బరిలో ఉంది. యునెస్కో...

Ramappa Temple: 'రామప్ప'కు కీర్తి దక్కింది.. ఇప్పుడు క్రెడిట్ పంచాయతీ మొదలయ్యింది...
Ramappa Temple
Ram Naramaneni
|

Updated on: Jul 26, 2021 | 10:49 AM

Share

2020 ఏడాదికి గాను రామప్పకు ఈ హోదా దక్కింది. 2021 ఏడాది నామినీగా గుజరాత్‌కి చెందిన ధోలవీర ఆలయం వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ బరిలో ఉంది. యునెస్కో గుర్తింపు కోసం ప్రపంచ వారసత్వ జాబితాలో 167 దేశాల నుంచి 1,121 కట్టడాలు పోటీ పడ్డాయి. రామప్పకు వారసత్వ సంపద హోదా రాకుండా నార్వే అడ్డుకునే యత్నం చేయగా.. భారత్‌ తరఫున రష్యా వాదించింది. రష్యాతోపాటు 17 దేశాలు ఆమోదం తెలపడంతో రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అయితే రామప్ప ఆలయానికి ఇలా గుర్తింపు వచ్చిందో లేదో.. అలా పొలిటికల్ యాక్షన్ ఊపందుకుంది. ఆలయానికి గుర్తింపు మావల్ల అంటే.. మా వల్ల వచ్చిందంటూ క్రెడిట్ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. 24 దేశాలు రోజుల తరబడి చర్చించినా.. రష్యాతో సహా 17 దేశాలు మద్ధతిచ్చాయంటే అదంతా సీఎం కేసీఆర్ కృషికి దక్కిన ఫలితంగా చెబుతారు.. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.

కానీ ఇక్కడే తెలంగాణ బీజేపీ చీఫ్.. బండి సంజయ్.. భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా లభించడం హర్షణీయమేనని.. అయితే ఇందుకు ప్రధాని మోదీ ఆశీస్సులు- సాంస్కృతిక శాఖా మంత్రి మీనాక్షి లేఖి సహకారం పని చేశాయనీ అన్నారాయన. అంతే కాదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.. బండి సంజయ్..

ఇక్కడ మేమింత కష్టపడి.. రామప్ప దేవాలయ ఘనకీర్తిని ప్రపంచానికి చాటితే.. ఇందులో బీజేపీ గొప్పదనం ఏముంది? అన్నది టీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్న వాదన. ఎంత బంగారు పళ్లానికైనా గోడ చేర్పు అవసరమనీ.. అలా మీరెంతగా రామప్ప దేవాలయపు ఘనతను తీర్చిదిద్దినా.. కేంద్ర సహకారం లేందే కుదరదన్నది.. బీజేపీ ప్రతివాదన. మరి చూడాలి.. ఈ వాదప్రతివాదాలు ఏ మలుపులు తీసుకుంటాయో.

Also Read: తెలంగాణ ప్రజలకు అభినందనలు.. రామప్పకు అరుదైన గౌరవంపై ప్రధాని మోడీ ట్వీట్

 జేసీ వర్సెస్ పెద్దారెడ్డి.. తాడిపత్రిలో మరోసారి పెరిగిన హీట్.. అగ్గి ఎక్కడ రాజుకుందంటే..?