Rahul Gandhi: హామీలన్నీ ఏమయ్యాయి.. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. రాహుల్ గాంధీ..
అభివృద్ధి అనే గ్యారెంటీతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది.. తెలంగాణలో వచ్చేది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ములుగులో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలన కొనసాగడం లేదని పేర్కొన్నారు. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఈ సారి ఎన్నికలు జరగబోతున్నాయన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం.. తెలంగాణ ఇచ్చిందని..

అభివృద్ధి అనే గ్యారెంటీతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది.. తెలంగాణలో వచ్చేది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ములుగులో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలన కొనసాగడం లేదని పేర్కొన్నారు. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఈ సారి ఎన్నికలు జరగబోతున్నాయన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం.. తెలంగాణ ఇచ్చిందని.. కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా పాలన జరుగుతుందంటూ మండిపడ్డారు. రాజకీయ పార్టీలు తమకు నష్టం జరిగే నిర్ణయాలు తీసుకోవని.. కానీ.. తెలంగాణ విషయంలో ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారు. ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ గౌరవించి తెలంగాణ ఇచ్చిందని రాహుల్ గుర్తుచేశారు. సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చి మోసం చేశారని విమర్శించారు. అందరికీ ఉద్యోగాలిస్తామని కేసీఆర్ మోసం చేసి పాలన చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌లో అవినీతి జరిగిందని.. అందుకే తాము రద్దు చేస్తామనన్నామని తెలిపారు. రూ.లక్ష రుణమాపీ అన్నారు..చేయలేదని పేర్కొన్నారు. మూడెకరాల భూమి కూడా ఇవ్వలేదని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా పాలన చేయడం లేదని దుయ్యబట్టారు.
రామప్ప వంటి సుందరమైన ఆలయాన్ని ఇప్పటి వరకూ చూడలేదన్నారు రాహుల్‌గాంధీ. దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిందని.. ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ ఎలా సాకారం చేసిందో ప్రపంచమంతా చూసిందన్నారు.
#CongressVijayabheriYatra from Ramappa Temple to Ramanujapuram village in Telangana, led by Shri @RahulGandhi and Smt. @priyankagandhi ji, saw a huge turnout.
The public's overwhelming support demonstrates their faith in the promises and pro-people policies of Congress.
— Congress (@INCIndia) October 18, 2023
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల గురించి రాహుల్ గాంధీ మరోసారి చెప్పారు. తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామంటూ హామీనిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగాలు ఇస్తామని.. రైతులకు రుణమాఫీ చేస్తామని.. ప్రకటించారు. అన్ని వర్గాలను ఆదుకునేలా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రకటించిందని తెలిపారు. మేడారం జాతరను జాతీయ ఉత్సవంగా ప్రకటిస్తాం.. కేంద్రంలో అధికారంలోకి రాగానే అమలు చేస్తామంటూ రాహుల్ హామీనిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటేనంటూ విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలను ఓడించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు అండగా నిలవాలని.. ఆదివాసీల భూములను, హక్కులను కాపాడుతామని.. హామీలను నిలబెట్టుకుంటామంటూ ములుగు విజయభేరి సభలో రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.
तेलंगाना का वादा कांग्रेस ने आपसे 2004 में किया था। पूरी दुनिया जानती है कि कांग्रेस ने उस वादे को पूरा कर के दिखाया।
कांग्रेस ने यहां की जनता के बारे में सोचा, यहां के गरीब लोगों के बारे में सोचा और यह निर्णय लिया।
ये सच्चाई आपके सामने है और इसे कोई नहीं मिटा सकता।
— Congress (@INCIndia) October 18, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
