AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూల్స్ రీఓపెన్‌ జూన్ 12న కాదు.. ఆ 3 రోజులు సెలవులే..

స్కూల్ పిల్లలకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఎండల తీవ్రత, వరుస సెలవుల నేపథ్యంలో పాఠశాలల రీఓపెనింగ్ తేదీని పొడిగిస్తూ విద్యాశాఖ డైరెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. జూన్ 12న స్కూళ్లు తెరవాల్సి ఉండగా.. ఆ వెంటనే రెండో శనివారం, ఆదివారం రావడంతో తేదీని మార్చారు.

Telangana: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూల్స్ రీఓపెన్‌ జూన్ 12న కాదు.. ఆ 3 రోజులు సెలవులే..
Telangana School Reopening Date Changed
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Jun 07, 2026 | 1:03 PM

Share

తెలంగాణలో పాఠశాలల రీఓపెన్‌పై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా నిర్ణయించిన తేదీని మారుస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు జూన్ 12న కాకుండా జూన్ 15వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి వేసవి సెలవుల తర్వాత జూన్ 12న పాఠశాలలను తిరిగి తెరవాలని విద్యాశాఖ భావించింది. అయితే ఆ తర్వాతి రోజుల్లో అంటే జూన్ 13న రెండో శనివారం, జూన్ 14న ఆదివారం వచ్చాయి. కేవలం ఒక్క రోజు అంటే జూన్ 12న స్కూళ్లు తెరిచి, ఆ వెంటనే వరుసగా రెండు రోజులు సెలవులు రావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నుండి ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు అందాయి. ఈ విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించిన ప్రభుత్వం, విద్యార్థుల సౌకర్యార్థం రీఓపెనింగ్ తేదీని జూన్ 15 సోమవారంకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఆ సెలవు క్యాన్సిల్

పాఠశాలల పునఃప్రారంభం ఆలస్యం కావడం వల్ల విద్యార్థులు కోల్పోయే విద్యా సమయాన్ని, నిర్దేశిత పనిదినాలను భర్తీ చేసేందుకు విద్యాశాఖ ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ 2026-27 ప్రకారం పనిదినాల నియమాలను పాటించేందుకు గానూ.. వచ్చే నెల జూలై 11 వచ్చే రెండో శనివారాన్ని సాధారణ పనిదినగా మార్చారు. ఆ రోజున రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు యధావిధిగా నడుస్తాయని స్పష్టం చేశారు.

అధికారులకు కీలక ఆదేశాలు

ఈ నూతన ఆదేశాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్లు, అలాగే అన్ని జిల్లాల డీఈవోలు తమ పరిధిలోని పాఠశాలలకు చేరవేసి, తగిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. ఈ నిర్ణయంతో విద్యార్థులకు వరుస సెలవుల ఊరట లభించినట్లయింది.

Follow Us
విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూల్స్ రీఓపెన్‌ జూన్ 12న కాదు..
విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూల్స్ రీఓపెన్‌ జూన్ 12న కాదు..
ఇంట్లో పనులు చేస్తూనే నెలకు లక్షల్లో ఆదాయం.. ఎలా అప్లై చేయాలంటే?
ఇంట్లో పనులు చేస్తూనే నెలకు లక్షల్లో ఆదాయం.. ఎలా అప్లై చేయాలంటే?
సీతారామ శాస్త్రి చెప్పిన ఈ మాటలు వింటే జీవితం గురించి తెలుస్తుంది
సీతారామ శాస్త్రి చెప్పిన ఈ మాటలు వింటే జీవితం గురించి తెలుస్తుంది
టీవీకే పార్టీలోకి స్టార్ హీరో! ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడుగా..
టీవీకే పార్టీలోకి స్టార్ హీరో! ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడుగా..
ఎంత పని జేస్తివి పంతు..! మేం హ్యాపీగా ఉండొద్దా?
ఎంత పని జేస్తివి పంతు..! మేం హ్యాపీగా ఉండొద్దా?
స్కర్ట్, హైహీల్స్‌లో ఇంజనీర్.. కోట్లాది మందిని ఆకట్టుకున్న స్టైల్
స్కర్ట్, హైహీల్స్‌లో ఇంజనీర్.. కోట్లాది మందిని ఆకట్టుకున్న స్టైల్
గూగుల్ పే, ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంటర్నెట్ లేకపోయినా..
గూగుల్ పే, ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంటర్నెట్ లేకపోయినా..
ఆదానీ-అంబానీ.. వీరు రోజూ ఎంత సంపాదిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఆదానీ-అంబానీ.. వీరు రోజూ ఎంత సంపాదిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఈ ఐస్‌క్రీమ్ బంగారం కన్నా కాస్ట్లీ గురూ.. ఒక్క స్కూప్ ధర ఎంతంటే?
ఈ ఐస్‌క్రీమ్ బంగారం కన్నా కాస్ట్లీ గురూ.. ఒక్క స్కూప్ ధర ఎంతంటే?
పెద్ది ఊచకోత.. 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
పెద్ది ఊచకోత.. 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..