AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cooler Tips: మీ ఇంట్లో కూలర్ ఉందా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లైట్ తీసుకుంటే రిస్కే..

చాలామంది ఇళ్లలో కూలర్ ఆన్‌లో ఉండగానే పైనుంచి మగ్గులతోనో, పైపులతోనో నీళ్లు నింపేస్తుంటారు. ఒకవేళ మీరు కూడా ఇదే తప్పు చేస్తుంటే మాత్రం భారీ ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే. కూలర్లను సురక్షితంగా ఎలా నిర్వహించాలి? వైరింగ్ మార్చడం దగ్గరి నుండి.. మోటార్ ఓవర్ హీట్ అవ్వకుండా కాపాడుకునే చిట్కాల గురించి తెలుసుకుందాం..

Cooler Tips: మీ ఇంట్లో కూలర్ ఉందా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లైట్ తీసుకుంటే రిస్కే..
Air Cooler Safety Tips
Krishna S
|

Updated on: Jun 07, 2026 | 1:42 PM

Share

ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా ఎయిర్ కూలర్లు తిరుగుతూనే ఉన్నాయి. ఏసీలు కొనలేని సామాన్యులకు, మధ్యతరగతి వారికి ఈ కూలర్లే పెద్ద దిక్కు. అయితే కూలర్ల ద్వారా వేడి నుండి ఉపశమనం లభిస్తున్నప్పటికీ.. మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల అవి ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతున్నాయి. కూలర్ బాడీకి కరెంట్ రావడం, ఆకస్మిక విద్యుత్ షాక్‌ల వల్ల ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మనం తరచూ వింటూనే ఉంటాం. అలాగని కూలర్ వాడటం ఆపేయాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ముప్పును పూర్తిగా తగ్గించుకోవచ్చు.

ఉపయోగించే ముందు వైరింగ్‌ను తనిఖీ చేయండి

చాలామంది గతేడాది వాడిన కూలర్లను ఈ వేసవిలో తీసి నేరుగా ప్లగ్ పెట్టేస్తుంటారు. అలా కాకుండా కూలర్‌ను ఆన్ చేసే ముందే దాని వైరింగ్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏవైనా వైర్లు ఎలుకలు కొరికేసినా, కాలిపోయినా లేదా వదులుగా ఉన్నా వాటిని వెంటనే మార్చాలి. చాలామంది తెగిపోయిన వైర్లకు కేవలం నల్ల టేప్ చుట్టి వాడేస్తుంటారు. దీనివల్ల షార్ట్ సర్క్యూట్లు, బాడీకి కరెంట్ లీక్ అయ్యే ప్రమాదం విపరీతంగా పెరుగుతుంది.

కూలర్ ఆన్‌లో ఉన్నప్పుడు నీళ్లు నింపవద్దు

దేశంలో జరిగే కూలర్ ప్రమాదాలలో 90 శాతం ప్రమాదాలు ఇక్కడే జరుగుతాయి. కూలర్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు లేదా తడి చేతులతో నీళ్లు నింపడానికి ప్రయత్నించినప్పుడు విద్యుత్ షాక్‌లు తగులుతాయి. కూలర్‌లో నీళ్లు నింపే ముందు ఎల్లప్పుడూ దాని స్విచ్ ఆఫ్ చేసి, ప్లగ్‌ను సాకెట్ నుండి పూర్తిగా తీసివేయాలి. తడి చేతులతో కూలర్ బాడీని గానీ, రెగ్యులేటర్ నంబ్‌లను గానీ తాకవద్దు. కూలర్ నుండి స్వల్పంగా కరెంట్ లీక్ అవుతున్నట్లు అనిపిస్తే, వెంటనే ఎలక్ట్రీషియన్‌తో ఇన్సులేషన్ చెక్ చేయించండి.

మోటార్ – పంపును గమనించండి

కూలర్ యొక్క మోటార్, వాటర్ పంపును క్రమం తప్పకుండా క్లీన్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా పాత కూలర్ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. మోటార్ చుట్టూ మురికి పేరుకుపోవడం, నడుస్తున్నప్పుడు అసాధారణ శబ్దాలు రావడం లేదా కాలిపోతున్నట్లు వాసన వస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ట్యాంక్‌లో నీరు లేకపోయినా పంపును ఆన్‌లో ఉంచితే అది ఓవర్ హీట్ అయి పగిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ట్యాంక్‌లో తగినంత నీరు ఉండేలా చూసుకోండి.

గంటల తరబడి హై-స్పీడ్‌లో నడపవద్దు

వేడి ఎక్కువగా ఉందని చాలామంది కూలర్లను రోజంతా పూర్తి వేగంతో నడుపుతుంటారు. ఇది మోటారుపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల మోటార్ వేడెక్కి షార్ట్ సర్క్యూట్ అవ్వడం లేదా అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు కూలర్ స్పీడ్‌ను మీడియం లేదా లో-లో ఉంచడం మంచిది. అలాగే అప్పుడప్పుడు కొద్దిసేపు కూలర్‌కు రెస్ట్ ఇవ్వాలి.

వోల్టేజ్ సమస్యలు ఉంటే స్టెబిలైజర్ వాడండి

గ్రామాల్లో లేదా కొన్ని ప్రాంతాల్లో వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. పవర్ పదే పదే పోయి రావడం వల్ల కూలర్ మోటార్ కాలిపోయే ఛాన్స్ ఉంది. అటువంటి సందర్భాలలో వోల్టేజ్ స్టెబిలైజర్‌ను ఉపయోగించడం ఉత్తమం. ఇది స్పార్కింగ్ లేదా మోటార్ ఫైర్ ప్రమాదాన్ని పూర్తిగా నివారిస్తుంది.

Follow Us