AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister KTR: ఏడేళ్లలో రాష్ట్రంలో 15 వేల పరిశ్రమలు.. భవిష్యత్‌కు అనుగుణంగా సౌర, పవన విద్యుత్‌కు ప్రాధాన్యత కేటీఆర్

గడిచిన ఏడేళ్లలో తెలంగాణకు 15 వేల పైచిలుకు పరిశ్రమలు ఏర్పడ్డాయని.. దాదాపు 2 లక్షల 20 వేల రూపాయల పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర పరిశ్రమల, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు.

Minister KTR: ఏడేళ్లలో రాష్ట్రంలో 15 వేల పరిశ్రమలు.. భవిష్యత్‌కు అనుగుణంగా సౌర, పవన విద్యుత్‌కు ప్రాధాన్యత కేటీఆర్
Minister Ktr
Balaraju Goud
|

Updated on: Jul 29, 2021 | 4:11 PM

Share

Premium energies Plant at Hyderabad E-City: గడిచిన ఏడేళ్లలో తెలంగాణకు 15 వేల పైచిలుకు పరిశ్రమలు ఏర్పడ్డాయని.. దాదాపు 2 లక్షల 20 వేల రూపాయల పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర పరిశ్రమల, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. హైద‌రాబాద్ ఈ-సిటీలో సౌర ప‌రిక‌రాల ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రీమియ‌ర్ ఎన‌ర్జీస్ ప్రారంభించింది. నగర శివారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రాంతంలో ఏర్పాటైన ప్రీమియ‌ర్ ఎన‌ర్జీస్ ప్లాంట్‌ను మంత్రులు కేటీఆర్, స‌బితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. పీవీ సెల్స్, మాడ్యూల్స్‌ను ప్రీమియ‌స్ ఎన‌ర్జీస్ ఉత్పత్తి చేస్తోంది. రూ. 483 కోట్ల వ్యయంతో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టును ప్రీమియ‌స్ ఎన‌ర్జీస్ ఏర్పాటు చేసింది. రెండేళ్లలో పెట్టుబ‌డుల‌ను రూ. 1200 కోట్లకు పెంచ‌నున్నట్లు ప్రీమియ‌స్ ఎన‌ర్జీస్ వెల్లడించింది.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పీవీ సెల్స్, మాడ్యూల్స్ ఉత్ప‌త్తిని ప్రారంభించినందుకు ప్రీమియ‌స్ ఎన‌ర్జీస్‌ను అభినందించారు. 18 నెల‌ల్లోనే సౌర ప‌రిక‌రాల ఉత్ప‌త్తి ప్లాంట్ ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా 700 మందికి ప్ర‌త్య‌క్ష ఉపాధి క‌లుగుతోంది. ఉపాధి క‌ల్ప‌న ప్ర‌భుత్వం ముందున్న అతిపెద్ద స‌వాల్ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సౌర‌, ప‌వ‌న విద్యుత్ ఉత్ప‌త్తికి పెద్ద‌పీట వేస్తున్నామ‌ని తెలిపారు. సౌర విద్యుత్ ఉత్ప‌త్తిలో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంద‌న్నారు.

ప్ర‌భుత్వ రంగంలో ఉన్న ఖాళీల నియామ‌కం త్వరలోనే చేపడుతామన్నారు. ప్ర‌యివేటు రంగంలో పెట్టుబ‌డుల ద్వారా ఉపాధి అవ‌కాశాలు మెరుగవుతాయన్నారు. ఏడేళ్ల‌లో రాష్ర్టానికి 15 వేల‌కు పైగా ప‌రిశ్ర‌మ‌లు వచ్చాయన్న మంత్రి.. 80 శాతానికి పైగా ప‌రిశ్ర‌మ‌లు త‌మ కార్య‌క‌లాపాలు ప్రారంభించాయ‌ని కేటీఆర్ గుర్తు చేశారు. ఇదే ప్రాంతంలో ఆగస్టు 5వ తేదీన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నామని తెలిపిన కేటీఆర్.. తద్వారా రావిర్యాల, మహేశ్వరం, తుక్కుగూడ ప్రాంత ప్రజలకు నైపుణ్యంతో కూడిని వృత్తి విద్యా శిక్షణ ఇస్తామన్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు.

ఎంతకు తెగించావ్‌రా.. అందరి ముందు సొంత తమ్ముడినే దారుణంగా..
ఎంతకు తెగించావ్‌రా.. అందరి ముందు సొంత తమ్ముడినే దారుణంగా..
బోడో సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ.. వీడియో
బోడో సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ.. వీడియో
ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. వేతనాలు ఇక ముందుగానే..
ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. వేతనాలు ఇక ముందుగానే..
షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్ ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే..
షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్ ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే..
టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?
టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే