AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మళ్లీ మొదలైన కెఎ.పాల్ హడావుడి.. తెలంగాణలో పాదయాత్రకు రెడీ.. ఎప్పటినుంచి అంటే..

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కెఎ.పాల్ తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 7 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానన్నారు. తయ పార్టీ సత్తా మునుగోడు ఎన్నికలలో ప్రజలు చూశారని, మునుగోడు ఎన్నికల్లో..

Telangana: మళ్లీ మొదలైన కెఎ.పాల్ హడావుడి.. తెలంగాణలో పాదయాత్రకు రెడీ.. ఎప్పటినుంచి అంటే..
Ka Paul
Amarnadh Daneti
|

Updated on: Dec 03, 2022 | 7:20 AM

Share

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కెఎ.పాల్ తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 7 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానన్నారు. తయ పార్టీ సత్తా మునుగోడు ఎన్నికలలో ప్రజలు చూశారని, మునుగోడు ఎన్నికల్లో ఈవీఎంలు మార్చే స్థితికి, గతికి టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు దిగజారాయని విమర్శించారు. ఈవీఎంలు మార్చి గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ నాలుగోసారి గెలవబోతుందని కెఎ.పాల్ జోస్యం చెప్పారు. ఈవీఎం లు మనకు వద్దని, అమెరికా మాదిరిగా బ్యాలెట్ పేపర్ లు కావాలని కోరుకుందామని చెప్పారు. డిసెంబర్ 13న ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు, కుల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులతో తాను ప్రత్యేకంగా సమావేశమవుతానని కేఏ పాల్ తెలిపారు. మునుగోడులో టీఆర్ఎస్ ను గెలిపిస్తే 15 రోజుల్లో మునుగోడు ను అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కానీ ముప్పై రోజులు అయినా ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని, ఊరేగింపులకు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. తెలంగాణ బిడ్డలారా అవినీతి పరులను మీరు నమ్ముతారా… ఢిల్లీ, పంజాబ్ ప్రజల్లాగా మార్పు కోరుకుంటారా అని పాల్ ప్రశ్నించారు.

తాను వారం రోజులు అమెరికాకు వెళ్లి వచ్చే సరికి రాష్ట్రం రావణ కాష్టంగా మారిందని పాల్ వ్యాఖ్యానించారు. ఈడీ రైడ్స్ ద్వారా టీఆర్ఎస్ నాయకుల దగ్గర వేల కోట్ల రూపాయలు పట్టుబడటం మనం చూస్తున్నామని చెప్పారు. వందల కోట్ల రూపాయలతో బీజేపీవారు ఎమ్మెల్యే లను కొనడం కూడా మనం చూస్తున్నామని అన్నారు. ఈ ఎన్నికలే లాస్ట్ ఎన్నికలని ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కావాలా…మార్పు కోరుకుంటున్నారా… అని ప్రజలను అడిగారు కెఎ.పాల్.

కేసీఆర్ రూ.5 లక్షల కోట్ల అప్పులు చేశారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏ పాల్ ఆరోపించారు. మోడీ పాలనలో ప్రపంచ దేశాలు భారత్ కు అప్పులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేవన్నారు. వైఎస్. షర్మిల గురించి మాట్లాడుతూ.. తన అన్న జగన్ నాలుగేళ్ళ లో రాజన్న రాజ్యం తీసుకొని రాలేదని, రాక్షస రాజ్యం, అవినీతి రాజ్యం తీసుకొని వచ్చారని తెలిపారు. జగన్ ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకొని రాలేదన్నారు కేఏ పాల్.తాను ప్రపంచానికి తెలుగు వారి సత్తా చూపానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని కెఎ.పాల్ కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..