AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIMS Recruitment: హైదరాబాద్‌ నిమ్స్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్ష జీతం పొందే అవకాశం..

నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (NIMS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌ పంజాగుట్టలో ఉన్న సంస్థలో టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి..

NIMS Recruitment: హైదరాబాద్‌ నిమ్స్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్ష జీతం పొందే అవకాశం..
Nims Jobs
Narender Vaitla
|

Updated on: Dec 03, 2022 | 7:35 AM

Share

నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (NIMS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌ పంజాగుట్టలో ఉన్న సంస్థలో టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 46 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్‌, ఎండీ, డీఎం, ఎంఎస్‌, ఎంసీహెచ్‌, డీఎన్‌బీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అనస్థీషియాలజీ, బయోకెమిస్టీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఎండోక్రైనాలజీ, జనరల్ మెడిసిన్, హెమటాలజీ, మెడికల్ జెనెటిక్స్, నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* అభ్యర్థుల వయసు 50 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్, నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్‌ అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,01,500 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 17-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
వర్షంతో మారిన లెక్కలు.. క్వార్టర్స్‌లో టీమిండియాతో అఫ్ఘాన్ ఢీ
వర్షంతో మారిన లెక్కలు.. క్వార్టర్స్‌లో టీమిండియాతో అఫ్ఘాన్ ఢీ
తిరుమల వెళ్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసుకోండి..
తిరుమల వెళ్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసుకోండి..
టికెట్ ఇచ్చిన 24 గంటల్లోనే గుడ్‌బై! ప్రశాంత్ కిషోర్‌‌కు షాక్..
టికెట్ ఇచ్చిన 24 గంటల్లోనే గుడ్‌బై! ప్రశాంత్ కిషోర్‌‌కు షాక్..
రూ.6,000 చెల్లింపును రూ.2,000 చొప్పున మూడుసార్లు చేస్తే ఏమవుతుంది
రూ.6,000 చెల్లింపును రూ.2,000 చొప్పున మూడుసార్లు చేస్తే ఏమవుతుంది
పై నుంచి చూస్తే అచ్చం ఇడ్లీ పిండిలాగే ఉంది.. కానీ లోపల.
పై నుంచి చూస్తే అచ్చం ఇడ్లీ పిండిలాగే ఉంది.. కానీ లోపల.
ఓటీటీలో వణికించే హారర్ థ్రిల్లర్.. పెళ్లైన ప్రతిసారీ కోడలికి అదే
ఓటీటీలో వణికించే హారర్ థ్రిల్లర్.. పెళ్లైన ప్రతిసారీ కోడలికి అదే
ధోనీ నుంచి లక్ష్మణ్ వరకు.. వీడ్కోలు మ్యాచ్ దక్కని దిగ్గజాలు వీరే
ధోనీ నుంచి లక్ష్మణ్ వరకు.. వీడ్కోలు మ్యాచ్ దక్కని దిగ్గజాలు వీరే
కిడ్నాపైన నాలుగేళ్ల పాపను రెస్క్యూ చేసిన పోలీసులు..
కిడ్నాపైన నాలుగేళ్ల పాపను రెస్క్యూ చేసిన పోలీసులు..
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటున్నారా?సైన్స్ ఏం చెబుతోంది
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటున్నారా?సైన్స్ ఏం చెబుతోంది
యూట్యూబ్‌లో బంగారం షో.. ఇంటికొచ్చేసరికి అంతా గోవిందా!
యూట్యూబ్‌లో బంగారం షో.. ఇంటికొచ్చేసరికి అంతా గోవిందా!