Samsung Jobs: కష్టకాలంలో శుభవార్త చెప్పి సామ్‌సంగ్.. భారీగా ఉద్యోగుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం వార్తలు చుట్టుముడుతున్నాయి. రోజుకో టాప్ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తుంది అన్న వార్తలు కలవర పెడుతున్నాయి. యాపిల్, ట్విట్టర్, మెటా, అమెజాన్ వంటి బడా ఐటీ కంపెనీల నుంచి చిన్న చిన్న స్టార్టప్‌ల వరకు ఉద్యోగులను ఇంటికి..
ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం వార్తలు చుట్టుముడుతున్నాయి. రోజుకో టాప్ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తుంది అన్న వార్తలు కలవర పెడుతున్నాయి. యాపిల్, ట్విట్టర్, మెటా, అమెజాన్ వంటి బడా ఐటీ కంపెనీల నుంచి చిన్న చిన్న స్టార్టప్‌ల వరకు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. ఇలాంటి వ్యతిరేక వార్తల నేపథ్యంలో తాజాగా సామ్‌సంగ్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. దక్షిణకొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్‌సంగ్ ఇండియా విభాగం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. సుమారు 1000 మంది ఇంజనీర్లను తీసుకునేందుకు కసరత్తులు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఇండియాలో ఉన్న టాప్ కాలేజీల్లో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.
కంప్యూటర్ సైన్స్‌తో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ నెట్‌వర్క్ స్ట్రీమ్‌ల నుంచి ఇంజినీర్లను తీసుకుంటామని సామ్‌సంగ్ ఓ ప్రకటనలో తెలిపింది. తాము చేపట్టిన ఈ ఉద్యోగ నియామకాలు డిజిటల్ ఇండియా విజన్‌ను మరింత మెరుగుపరుస్తుందని శాంసంగ్ ఇండియా తెలిపింది. బెంగళూరు, నోయిడా, ఢిల్లీ, బెంగళూరులోని రీసెర్చ్, అండ్ డెవలప్‌మెంట్ కేంద్రాలకు 1000 మందిని తీసుకోనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), కనెక్టివిటీ, క్లౌడ్, బిగ్ డేటా, బిజినెస్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీలకు సామ్‌సంగ్ పెద్ద పీట వేయనున్నారు.
ఉద్యోగాల నియామకాల విషయమై సామ్‌సంగ్ ఇండియా హ్యూమన్ రిసోర్సెస్ హెడ్ సమీర్ వాధావన్ మాట్లాడుతూ.. ‘కొత్త ఆవిష్కరణలపై దృష్టిసారించేందుకే కొత్త ప్రతిభను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాము. ఈ ఉద్యోగులు కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీలు, ప్రొడక్ట్స్, డిజైన్స్‌పై దృష్టి సారిస్తారు. కొత్తగా తీసుకోనున్న ఉద్యోగుల నుంచి భారత్ కేంద్రంగా సరికొత్త ఆవిష్కరణలకు నాంది పడుతుంది’ అని చెప్పుకొచ్చారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..