AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. 9 కొత్త మెడికల్ కాలేజీల్లో 3,897 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్..

జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తూ వైద్యం, వైద్య విద్యను పటిష్టం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేయబోయే మరో 9 మెడికల్ కాలేజీలకు..

Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. 9 కొత్త మెడికల్ కాలేజీల్లో 3,897 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్..
Telangana
Shaik Madar Saheb
|

Updated on: Dec 01, 2022 | 5:08 PM

Share

Telangana Medical Jobs: జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తూ వైద్యం, వైద్య విద్యను పటిష్టం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేయబోయే మరో 9 మెడికల్ కాలేజీలకు 3,897 పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో మెడికల్ కాలేజీకి వివిధ కేటగిరీల్లో కలిపి 433 పోస్టులను మంజూరు చేసింది. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయ శంకర్ భూపాలపల్లి, కొమరంభీం ఆసిఫాబాద్, జనగాం, నిర్మల్ మెడికల్ కాలేజీలకు, వీటి అనుబంధ ఆసుపత్రుల కోసం ప్రభుత్వ ఉద్యోగాల నియామకం చేపట్టనుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రారంభించిన 12 మెడికల్ కాలేజీలు సహా, కొత్తగా ఏర్పాటు చేయబోయే 9మెడికల్ కాలేజీల కోసం ఇప్పటి వరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో మొత్తం 15,476 పోస్టులు మంజూరు చేసింది.

ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యంతో పాటు, విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే, రాష్ట్రం ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్ మహబూబ్నగర్, సిద్ధిపేట, నల్గొండ, సూర్యపేటలో నాలుగు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. ఇలా మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్యను 8 ఏళ్లలో 5 నుంచి 17కు పెంచారు. ఇందులో భాగంగా ఈ ఏడాది నవంబర్ 15న రాష్ట్ర వ్యాప్తంగా 8 మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ వర్చువల్గా ప్రారంభించారు. దీంతో అదనంగా 1150 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2014 లో ప్రభుత్వ కాలేజీల్లో850 గా ఉన్న ఎంబిబిఎస్ సీట్లు, ఈ ఏడాది నాటికి 2790 కి పెరిగాయి. అన్ని జిల్లాల్లో ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే ఆలోచనతో భాగంగా, వచ్చే ఏడాది మరో 9 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఈరోజు 3,897 పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్వర్వులు జారీ చేసింది.

ఆరోగ్య తెలంగాణ దిశగా తెలంగాణ అడుగులు.. ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి మంత్రి హరీశ్ రావు

అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్యం, వైద్యను అందించే లక్ష్యంలో ఇదొక ముందడుగు అని మంత్రి హరీష్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నదన్నారు. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు వల్ల ఒకవైపు నాణ్యమైన వైద్యం, మరో వైపు మెడికల్ విద్య రాష్ట్ర ప్రజలకు చేరువవుతున్నది. నాడు పెద్ద పట్టణాలకు మాత్రమే పరిమితమైన స్పెషాలిటీ వైద్యం జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తుండటం వల్ల గ్రామీణ ప్రజలకు చేరువైంది. తద్వారా పేదలకు సమీపంలోనే ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందుతుండటంతో పాటు వైద్యం కోసం చేసే ఆర్థిక భారం నుంచి ఉపశమనం లభిస్తుంది. మరోవైపు డాక్టర్ కావాలని కలలుకనే విద్యార్థులకు, స్థానికంగా ఉంటూనే వైద్య విద్యను అభ్యసించే అవకాశాలు మెరుగుపడ్డాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

ఇవి కూడా చదవండి

విద్యా సంబంధిత సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us