Ponguleti Srinivas Reddy: కేసీఆర్ టైమ్ అయిపోయింది.. వచ్చే ఎన్నికల్లో ఇంటికే.. పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
వరుసగా ఆత్మీయ సమ్మేళనాలతో ఖమ్మంజిల్లాలో పొంగులేటి పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు. తాజాగా సత్తుపల్లిలో జరిగిన మీటింగ్‌లో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తానూ పుట్టి పెరిగిన సత్తుపల్లి నియోజకవర్గమంటే తనకు ఎంతో ఇష్టమన్నారు.

వరుసగా ఆత్మీయ సమ్మేళనాలతో ఖమ్మంజిల్లాలో పొంగులేటి పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు. తాజాగా సత్తుపల్లిలో జరిగిన మీటింగ్‌లో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తానూ పుట్టి పెరిగిన సత్తుపల్లి నియోజకవర్గమంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణ..అప్పుల తెలంగాణ మారిపోయిందన్నారు. ప్రజలు ఇప్పటికైనా కళ్లు తెరిచి చూడాలని, ధనిక రాష్ట్రం..ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా ఎలా..? ఎందుకు మారిందో గమనించాలని పొంగులేటి కోరారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పాలన తీరుపై మండిపడ్డారాయన. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను బీఆర్‌ఎస్ సర్కార్ తుంగలో తొక్కిందని విమర్శించారు. 36 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఇస్తామని చెప్పి, కేవలం 5 లక్షల మందికి మాత్రమే ఇచ్చారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ నమ్మదగ్గ మనిషి కాదని, మాయల మాటలు చెప్పటంలో దిట్ట అన్నారు. రాష్ట్రంలో దళితబంధు విషయంలోనే సీఎం కేసీఆర్ మోసం చేశారని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. 2018లో ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి, ఇప్పుడు కేవలం 3లక్షల రూపాయలు ఇస్తానని చెబుతున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ టైమ్ అయిపోయిందని, రెండుసార్లు తెలంగాణ బిడ్డలు నమ్మారని, మరోసారి ముఖ్యమంత్రిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చిన కేసీఆర్‌ను, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ బిడ్డలు ఇంటికి పంపిస్తారని పొంగులేటి జోస్యం చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందని విమర్శించారు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. 12వ తేదీ వచ్చినా ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిని ముఖ్యమంత్రి తీసుకొచ్చారని ఆరోపించారు. తన జెండా, గుర్తు ఏదైనా.. రానున్న ఎన్నికల్లో తానూ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలని అనుచరులకు పిలుపునిచ్చారు పొంగులేటి.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




