AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ponguleti Srinivas: తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

ఖమ్మంలో జరిగిన జనగర్జన సభకు ఎత్తున ప్రజలు తరలివచ్చారు. రాహుల్ గాంధీ సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అనంతరం సభావేదికగా పొంగులేటి కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

Ponguleti Srinivas: తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
Ponguleti Srinivas Reddy
Aravind B
|

Updated on: Jul 02, 2023 | 7:31 PM

Share

ఖమ్మంలో జరిగిన జనగర్జన సభకు ఎత్తున ప్రజలు తరలివచ్చారు. రాహుల్ గాంధీ సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అనంతరం సభావేదికగా పొంగులేటి కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు మాయమాటలు చెప్పి రెండుసార్లు అధికారంలోకి వచ్చారని వ్యాఖ్యానించారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగనట్లుగా తెలంగాణలో దాదాపు 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకన్నారని ఉద్ఘాటించారు. రాష్ట్రంలోని రైతులకు రుణ మాఫీ చేస్తానని నమ్మించి.. ఇప్పటికీ ఇచ్చిన హామీ నేరవేర్చలేదని విమర్శించారు. అలాగే నిరుద్యోగ భృతిని కూడా ఇవ్వకుండా మోసం చేశారంటూ మండిపడ్డారు.

రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే డిక్లరేషన్‌లో ఉన్నట్లుగా రైతులకు, యువతకు ఇచ్చిన హామీలు తప్పకుండా అమలుచేస్తామని పేర్కొన్నారు. జనగర్జన సభకు అడ్డంకులు వేసేందుకు బీఆర్ఎస్ వారం రోజుల నుంచి ఎన్నో ఇబ్బందులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా ఇబ్బందులను తట్టుకోని తమకు అండగా నిలబడిన కార్యకక్తలకు కృతజ్ఞతలని తెలిపారు. ఇక భవిష్యత్తులో బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇంటికి పంపించగలదని తెలిపారు. లక్షలాది మంది తెలంగాణ ప్రజలకు తనకు ఈ విషయాన్నే చెప్పారని.. వారి కోరిక మేరకే కాంగ్రెస్ పార్టీలో చేరానని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..