AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.. షిండే క్యాబినేట్ లోకి అజిత్ పవార్.

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి అనూహ్య మలుపు తిరిగాయి. బాబాయి శరద్‌పవార్‌పై తిరుగుబాటు చేశారు అజిత్‌పవార్‌. 30 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి షిండే సర్కార్‌కు మద్దతు ప్రకటించారు. రాజ్‌భవన్‌కు చేరుకున్న అజిత్‌పవార్‌ గవర్నర్‌కు మద్దతు లేఖ ఇచ్చారు. షిండే కేబినెట్‌లో చేరబోతున్నారు అజిత్‌పవార్‌. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని చెబుతున్నారు.

Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.. షిండే క్యాబినేట్ లోకి అజిత్ పవార్.
Ajit Pawar
Narender Vaitla
|

Updated on: Jul 02, 2023 | 2:44 PM

Share

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి అనూహ్య మలుపు తిరిగాయి. బాబాయి శరద్‌పవార్‌పై తిరుగుబాటు చేశారు అజిత్‌పవార్‌. 30 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి షిండే సర్కార్‌కు మద్దతు ప్రకటించారు. రాజ్‌భవన్‌కు చేరుకున్న అజిత్‌పవార్‌ గవర్నర్‌కు మద్దతు లేఖ ఇచ్చారు. షిండే కేబినెట్‌లో చేరారు అజిత్‌పవార్‌. అందరూ ఊహించినట్లుగానే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. కాసేపటి క్రితమే అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ఛగన్ భుజ్ భల్ ప్రమాణ స్వీకారం చేశారు.

అజిత్ పవార్ గ్రూప్ లో మరో 9 మంత్రికి మంత్రి వర్గంలో స్థానం కల్పించారు.  ఇదిలా ఉంటే ఎన్సీపీలో కొద్దిరోజుల క్రితమే నాయకత్వ మార్పు జరిగిన విషయం తెలిసిందే. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలేతో పాటు ప్రఫుల్‌ పటేన్‌ను నియమించారు. దీంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న అజిత్‌పవార్‌ తిరుగుబాటుకు తెర తీశారు. ఈక్రమంలోనే అజిత్‌పవార్‌తో పాటు సీఎం షిండే , డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌ కూడా రాజ్‌భవన్‌ చేరుకున్నారు. 30 మంది ఎమ్మెల్యేలతో అజిత్‌పవార్‌ సమావేశం జరిపిన విషయం తనకు తెలియదని శరద్‌ పవార్‌ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే అజిత్‌ పవర్‌ కొన్ని కొన్ని రోజుల క్రితం ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేస్తానని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో ఆదివారం ఆయన అధికార నివాసంలో సమావేశమయ్యారు. ఎన్‌సీపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి దక్కని కారణంగా అజిత్ పవర్‌ అసంతృప్తికి లోనైనట్లు సమాచారం. మహారాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో వేచి చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..