AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కలిసి బీజేపీ ఓడించాలని చూస్తున్నాయి.. బండి సంజయ్‌ వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి బీజేపీని ఓండించాలని చూస్తున్నాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ గడీలను బద్దలు కొట్టేది బీజేపీనేని బండి సంజయ్‌ విరుచుకుపడ్డారు. జులై 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో చేపట్టనున్న బహిరంగ సభను విజయవంతమం చేయాలని బండి సంజయ్‌ పిలుపునిచ్చారు....

Bandi Sanjay: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కలిసి బీజేపీ ఓడించాలని చూస్తున్నాయి.. బండి సంజయ్‌ వ్యాఖ్యలు
MP Bandi Sanjay Kumar
Narender Vaitla
|

Updated on: Jul 02, 2023 | 8:24 PM

Share

కాంగ్రెస్‌ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి బీజేపీని ఓండించాలని చూస్తున్నాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ గడీలను బద్దలు కొట్టేది బీజేపీనేని బండి సంజయ్‌ విరుచుకుపడ్డారు. జులై 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో చేపట్టనున్న బహిరంగ సభను విజయవంతమం చేయాలని బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ‘ఈనెల 8వ తేదీన వరంగల్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రాంగణంలో జరగనున్న మోదీ సభను విజయవంతం చేయాలి. గతంలో సభను విజయవంతంగా చేపట్టినందుకు మోదీ శభాష్‌ అన్నారు. ఈసారి కూడా శభాష్‌ అనిపించేలా సభను నిర్వహిద్దాం. నన్ను మెచ్చుకుంటే మిమ్మల్ని మెచ్చుకున్నట్లే’ అని కార్యకర్తలు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. ఇక ఇదే సందర్భంలో బండి మరోసారి బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు.

బండి మాట్లాడుతూ.. కేసీఆర్‌ అంటే మోసం.. బీఆర్‌ఎస్‌కు ఎప్పటికైనా బీజేపీ ప్రత్యామ్నాయం అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నా బండి.. కాంగ్రెస్‌ పార్టీలో ఒకరో ఇద్దరో చేరినంత మాత్రాన ఆ పార్టీకి సింగిల్‌గా పోటీ చేసే ధైర్యం లేదన్నారు. దుబ్బాక, మునుగోడు, హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్‌ కూడా రాలేదన్నారు. బీజేపీ ఎజెండా పేదల సంక్షేమన్న బండి సంజయ్‌.. బీఆర్‌ఎస్‌ గడీలను బద్దలు కొట్టేదే బీజేపీనే అన్నారు. కాంగ్రెస్‌ను పట్టించుకోవాల్సిన అసవరం లేదన్న బండి.. అంతా కష్టపడి పనిచేసి సభను సక్సెస్‌ చేయాని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..