AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. ప్రభుత్వాసుపత్రిలో ఈసీజీ, 2డీతో పాటు మరెన్నో పరీక్షలు. పూర్తి ఉచితంగా..

ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వేలల్లో ఖర్చయ్యే వైద్య పరీక్షలను ఉచితంగా అందిస్తోంది. టీ డయాగ్నొస్టిక్‌ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వాసుపత్రుల్లో పలు పరీక్షలను ఉచితంగా నిర్వహించుకునే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌...

తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. ప్రభుత్వాసుపత్రిలో ఈసీజీ, 2డీతో పాటు మరెన్నో పరీక్షలు. పూర్తి ఉచితంగా..
Telangana Diagnostics
Narender Vaitla
|

Updated on: Jul 02, 2023 | 8:46 PM

Share

ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వేలల్లో ఖర్చయ్యే వైద్య పరీక్షలను ఉచితంగా అందిస్తోంది. టీ డయాగ్నొస్టిక్‌ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వాసుపత్రుల్లో పలు పరీక్షలను ఉచితంగా నిర్వహించుకునే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరీక్షలకు అదనంగా మరికొన్నింటిని జోడించినట్లు మంత్రి తెలిపారు. పేదలకు వైద్య పరీక్షలు భారం కాకూడదనే ఉద్దేశంతోనే తెలంగాణ డయాగ్నొస్టిక్‌ సేవలు అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

2018లో హైదరాబాద్‌లో టీ డయాగ్నస్టిక్‌ సేవలు ప్రారంభించామని, ఇప్పుడు ఈ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించామని మంత్రి తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బస్తీ దవాఖాలల్లోనూ ఈ సేవలను అందిస్తున్న మంత్రి తెలిపారు. పాతలాజికల్‌ సేవల్లో భాగంగా రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, ఇమేజింగ్‌ సేవల్లో భాగంగా ఎక్స్‌ రే, యూఎస్‌జీ, ఈసీజీ, 2డీ, ఎకో, మెమోగ్రామ్‌ అందిస్తున్నట్లు మంత్రి వివరించారు.

ఇవి కూడా చదవండి

ఇక టీ డయాగ్నస్టిక్‌ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 57.68లక్షల మంది పరీక్షలు చేయించుకున్నట్లు మంత్రి తెలిపారు. దీని ద్వారా ప్రజలకు రూ. 10.40 కోట్ల భారం తగ్గిందని మంత్రి వివరించారు. ఈ సెంటర్స్‌లో చేసే పరీక్షలను 134కి పెంచినట్లు మంత్రి పేర్కొన్నారు. టీ డయాగ్నస్టిక్‌ సేవలను నీతి ఆయోగ్‌ సైతం ప్రశంసించిందని మంత్రి తెలిపారు. ఈ సేవలను విజయంతంగా నడిపించడంలో కృషి చేస్తున్న మంత్రి హరీష్‌ రావుతో పాటు వారి బందానిన్ని కేటీఆర్‌ అభినందిస్తూ ట్వీట్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి