AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Huzurabad – Badvel Elections: హుజూరాబాద్, బద్వేల్‌లో ప్రారంభమైన పోలింగ్.. ఓటర్లు ఇవి తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిందే..

Huzurabad - Badvel Elections: హుజూరాబాద్ ఎమ్మెల్యే నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే పోలింగ్‌కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా..

Huzurabad - Badvel Elections: హుజూరాబాద్, బద్వేల్‌లో ప్రారంభమైన పోలింగ్.. ఓటర్లు ఇవి తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిందే..
Elections
Shiva Prajapati
|

Updated on: Oct 30, 2021 | 8:29 AM

Share

Huzurabad – Badvel Elections: హుజూరాబాద్ ఎమ్మెల్యే నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే పోలింగ్‌కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా.. ఇప్పుడు పోలింగ్ ప్రారంభించారు. తొలుత మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ రాత్రి 7 గంటల వరకు జరుగనుంది. నియోజకవర్గంలోని హుజూరాబాద్‌, వీణవంక, కమలాపూర్‌, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో పోలింగ్‌ జరగుతుంది. మొత్తం 106 గ్రామ పంచాయతీల్లో 306 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,715 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,36,283 మంది ఓటర్లు ఉండగా.. 1,18,720 మంది పురుష ఓటర్లు, 1,17,563 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇదిలాఉంటే.. నియోజకవర్గం పరిధిలో 107 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు ఎన్నికల అధికారులు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. మొత్తం 3,865 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.

బద్వేల్‌ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం.. ఆంధ్రప్రదేశ్‎ కడప జిల్లాలోని బద్వేల్‎ ఉపఎన్నిక పోలింగ్‎ ప్రారంభం అయ్యింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. ఇక్కడ మొత్తం 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నియోజకవర్గంలో 281 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అందులో 221 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఈ ఉపఎన్నికకు 3000 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధానంగా వైసీపీ, బీజేపీ మధ్య పోటీ ఉండనుంది. బద్వేల్ నియోజకవర్గంలో మొత్తం 2,16,139 ఓటర్లు ఉన్నారు. అందులో 1,07,340 మహిళలు ఉండగా.. 1,08,799 పురుషులు ఉన్నారు. ఇక్కడ 914 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. నియోజకవర్గంలోని బద్వేలు, కలసపాడు, బి.కోడూరు, ఎస్‌.ఎ. కాశినాయన, పోరుమామిళ్ల, గోపవరం, ఆల్టూరు మండలాల్లో పోలింగ్ జరుగుతోంది.

ఓటర్లు ఇవి తీసుకెళ్లాల్సిందే.. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. కరోనా పేషెంట్లకు సాయంత్రం 6 గంటలకు ఓటింగ్‌కు అవకాశం ఇచ్చారు అధికారులు. కాగా, ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లు తమ వెంట ఓటర్ స్లిప్‌తో పాటు.. ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

Also read:

By Polls 2021: దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 29 అసెంబ్లీ.. 3 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు ఈరోజే..

Punith Raj Kumar: పునీత్ మరణవార్త నమ్మలేకపోయా.. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అంటున్న సుమన్

Silver Price Today: గుడ్‏న్యూస్.. తగ్గిన వెండిధరలు.. తెలుగురాష్ట్రాల్లో సిల్వర్ రేట్స్ ఇలా..