Silver Price Today: గుడ్‌న్యూస్.. తగ్గిన వెండిధరలు.. తెలుగురాష్ట్రాల్లో సిల్వర్ రేట్స్ ఇలా..
పండగ సీజన్లో బంగారం ధరలు సామాన్యులకు షాకిస్తున్నాయి. ఈ క్రమంలో వెండి ధరలు కాస్త ఊరట కల్గిస్తున్నాయి. గత కొద్ది
పండగ సీజన్లో బంగారం ధరలు సామాన్యులకు షాకిస్తున్నాయి. ఈ క్రమంలో వెండి ధరలు కాస్త ఊరట కల్గిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా వెండి ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. అటు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధరలు మాత్రం తగ్గాయి. ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో వెండి ధరలు కాస్త తగ్గి కిలో వెండి ధర రూ. 64,000కు చేరుకుంది. ఇక 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ. 646కు చేరింది.
అలాగే ఢిల్లీలోనూ వెండి ధరలలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 64,600కు చేరింది. ఇక ముంబైలో కేజీ సిల్వర్ రేట్ రూ. 64,600కు చేరింది. అలాగే చెన్నైలో కేజీ సిల్వర్ రూ. 68,800కు చేరగా.. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 68,800కు చేరింది. అలాగే విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కేజీ సిల్వర్ రేట్ రూ. 68,800కు చేరింది. ఇక ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,850 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,930కు చేరుకున్నాయి. అలాగే విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,850 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,930కు చేరింది. ఇక ముంబై మార్కెట్లో ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,050కు చేరగా… 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,050కు చేరింది.
Puneeth Rajkumar: పునీత్ రామ్‌కుమార్ అకాల మరణం.. ప్రశ్నార్థకంగా మారిన రూ. 400 కోట్ల పెట్టుబడులు..
Peddanna : సూపర్ స్టార్ “పెద్దన్న” సినిమా నుంచి సూపర్ మాస్ సాంగ్.. ఆకట్టుకుంటున్న ‘రా సామీ’ పాట..