AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puneeth Rajkumar: ‘ఎప్పుడు ఉంటామో.. పోతామో తెలియదు’.. పునీత్‌ రాజ్‌ మృతిపై రామ్‌ గోపాల్‌ వర్మ కామెంట్స్‌..

Puneeth Rajkumar: కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రామ్ కుమార్‌ హఠాన్మరణంతో సినీ ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. యావత్‌ ఇండియన్‌ సినీ లవర్స్‌ పునీత్‌ మరణ వార్త విని షాక్‌కి గురయ్యారు...

Puneeth Rajkumar: 'ఎప్పుడు ఉంటామో.. పోతామో తెలియదు'.. పునీత్‌ రాజ్‌ మృతిపై రామ్‌ గోపాల్‌ వర్మ కామెంట్స్‌..
Puneeeth Raj Kumar Rgv
Narender Vaitla
|

Updated on: Oct 30, 2021 | 5:44 AM

Share

Puneeth Rajkumar: కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రామ్ కుమార్‌ హఠాన్మరణంతో సినీ ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. యావత్‌ ఇండియన్‌ సినీ లవర్స్‌ పునీత్‌ మరణ వార్త విని షాక్‌కి గురయ్యారు. అప్పటి వరకు ఉషారుగా జిమ్‌లో వర్కవుట్స్‌ చేసిన వ్యక్తి ఒక్కసారిగా గుండె పోటుతో కుప్పకూలిపోవడం అందరినీ కలిచి చేస్తోంది. చిన్న వయసులో నూరేళ్లు నిండిపోవడం ఏంటనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం తన ఇంట్లో జిమ్ చేస్తుండగా ఒక్కసారిగా పునీత్ కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే కుటుంబసభ్యులు బెంగుళూరులోని విక్రమ్ హాస్పటల్‌కు తరలించారు కుటుంబసభ్యులు.

అయితే పరిస్థితి విషమించడంతో పునీత్ కన్నుమూశారు. పునీత్ మరణ తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నుంచి శాండిల్‌ వుడ్‌ వరకు అందరు తారలు సోషల్‌ మీడిఆయలో పోస్టులు పెడుతున్నారు. తమకు పునీత్‌ రాజ్‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే సంచలన దర్శకుడు రామ్‌గోపాలవ్‌ వర్మ కూడా పునీత్‌ మరణ వార్తపై స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆర్జీవీ ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఇందులో వర్మ.. ‘పునీత్‌ రాజ్‌ హఠాన్మరణ వార్త షాకింగ్‌కి గురి చేసింది. అయితే ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. మన కళ్లు తెరిపించే భయంకరమైన నిజం.. ఎవరం ఎప్పుడు మరణిస్తామో తెలియదు. కాబట్టి జీవితాన్ని బతికుండగానే సంతోషంగా గడిపేయాలి’ అంటూ తనదైన శైలిలో కామెంట్ చేశారు. ప్రతీ అంశంలో కాంట్రవర్సీ వెతికే వర్మ.. పునీత్ మరణం విషయంలో మాత్రం భిన్నంగా స్పందించడంతో నెటిజన్లు ఆయనకు మద్ధతుగా కామెంట్లు చేస్తున్నారు.

వర్మ చేసిన పోస్ట్..

View this post on Instagram

A post shared by RGV (@rgvzoomin)

Also Read: Vijay Sethupathi Bike Photos: BMW బైక్ కొన్న ‘మక్కల్ సెల్వన్’.. స్వయంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్లిన ‘విజయ్ సేతుపతి’.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Anasuya Photos: మోడరన్ డ్రస్ లో ‘అనసూయ’.. న్యూ లుక్ తో అదరగొడుతున్న రంగమ్మత్త.. (ఫొటోస్)

Covid vaccination: శనివారం నుంచి ఇంటింటికి రెండో డోస్ వ్యాక్సినేషన్.. జీహెచ్ఎంసీ పరిధిలో స్పెషల్ డ్రైవ్..