AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puneeth Rajkumar: పునీత్‌ రాజ్‌కుమార్‌ అకాల మరణం.. ప్రశ్నార్థకంగా మారిన రూ. 400 కోట్ల పెట్టుబడులు..

Puneeth Rajkumar: ఒక వ్యక్తి సమాజానికి ఎంతో కొంత చేయకపోతే ఆయన మరణం సమాజాన్ని ఇంతలా కదిలించదు. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరూ పునీత్ రాజ్‌కుమార్‌ మరణంపై..

Puneeth Rajkumar: పునీత్‌ రాజ్‌కుమార్‌ అకాల మరణం.. ప్రశ్నార్థకంగా మారిన రూ. 400 కోట్ల పెట్టుబడులు..
Puneeth Raj Kumar
Narender Vaitla
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 30, 2021 | 8:51 AM

Share

Puneeth Rajkumar: ఒక వ్యక్తి సమాజానికి ఎంతో కొంత చేయకపోతే ఆయన మరణం సమాజాన్ని ఇంతలా కదిలించదు. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరూ పునీత్ రాజ్‌కుమార్‌ మరణంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలనటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారంటేనే పునీత్ నటన ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీపై పునీత్‌ తన ప్రభావాన్ని చూపించారు. ఈ కారణంగానే ఆయన లేరన్న నిజాన్ని సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ నుంచి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్‌ వద్ద రూ. 100 కోట్ల వ్యాపారం జరగాల్సిందే. అంతలా తన మార్కును చూపించారు. ఇలాంటి తరుణంలో గుండెపోటుతో మరణించడం కన్నడ ఇండస్ట్రీపై కూడా ప్రభావం చూపుతుందని చర్చలు జరుగుతున్నాయి.

ఇటీవలి కాలంలో పునీత్‌ చేసిన సినిమాలన్నీ రూ. 40 నుంచి రూ. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినవే. పునీత్ రాజ్‌ ప్రస్తుతం జేమ్స్‌, ద్విత్త అనే రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల బడ్జెట్‌ కలిపి రూ. 120 కోట్లు. దీంతో వీటి భవిత్వం ఏంటన్న ప్రశ్నలు మొదలయ్యాయి. అలాగే ఈ రెండు సినిమాలతో పాటు పునీత్‌ తన స్వంత బ్యానర్‌లో ఏకంగా 5 సినిమాలు చేయడానికి ప్రణాళికలు రచించుకున్నారు. ఇలాంటి సమయంలో పునీత్ మరణ వార్త ఒక్కసారిగా ఇండస్ట్రీని షాక్‌కి గురి చేసింది. పునీత్‌ లైన్‌లో పెట్టిన ప్రాజెక్ట్‌ల విలువ దాదాపు రూ. 400 కోట్లకుపైమాటే అని తెలుస్తోంది. మరి ఈ యంగ్‌ హీరో అకాల మరణంతో ఇన్ని కోట్ల రూపాయల ప్రాజెక్టులు కూడా ప్రశ్నార్థకంగా మారాయి.

Also Read: Puneeth Rajkumar Live: కన్నడ పవర్‌స్టార్‌ ‘పునీత్‌ రాజ్‌కుమార్‌’ కన్నుమూత.. కర్ణాటకలో హై అలర్ట్‌.. (లైవ్ వీడియో)

Anasuya Photos: మోడరన్ డ్రస్ లో ‘అనసూయ’.. న్యూ లుక్ తో అదరగొడుతున్న రంగమ్మత్త.. (ఫొటోస్)

Aryan Khan: షారుక్ ఖాన్‌కు మరోసారి నిరాశ.. కొడుకు ఆర్యన్ ఖాన్ మరోరాత్రి జైలులోనే..