Microsoft: ఆపిల్‌ను వెనక్కి నెట్టేసిన మైక్రోసాఫ్ట్.. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ!

ఆపిల్‌ను వెనక్కి నెట్టి మైక్రోసాఫ్ట్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాప్ శుక్రవారం నాటికి 2.46 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగా, ఆపిల్ మార్కెట్ క్యాప్ 2.43 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.

Microsoft: ఆపిల్‌ను వెనక్కి నెట్టేసిన మైక్రోసాఫ్ట్.. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ!
Microsoft Vs Apple
Follow us
KVD Varma

|

Updated on: Oct 30, 2021 | 7:40 AM

Microsoft: ఆపిల్‌ను వెనక్కి నెట్టి మైక్రోసాఫ్ట్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాప్ శుక్రవారం నాటికి 2.46 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగా, ఆపిల్ మార్కెట్ క్యాప్ 2.43 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఆపిల్ నాలుగవ త్రైమాసిక ఫలితాలు ఆశించిన విధంగా రాలేదు. దీని కారణంగా ఈ మార్పు కనిపించింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆపిల్‌ షేరు 2.27% పడిపోయాయి. ఆపిల్‌ షేర్లు 2.27% తగ్గి 149.16 డాలర్ల వద్ద, మైక్రోసాఫ్ట్ షేర్లు 1.34% పెరిగి 328.69 డాలర్ల వద్ద ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ షేర్ అత్యధికంగా 329.52 డాలర్లు.. కనిష్టంగా 323.90 డాలర్లకు చేరుకుంది. ఆపిల్ స్టాక్ కనిష్టంగా 146.41డాలర్లు గరిష్టంగా 147.22 డాలర్లు నమోదు చేసింది.

సరఫరా గొలుసు అంతరాయాల కారణంగానే..

నాల్గవ త్రైమాసికంలో ఐఫోన్ అమ్మకాలు సంవత్సరానికి 47% పెరిగాయి. కానీ, విశ్లేషకుల అంచనాల కంటే తక్కువగా ఉన్నాయి. సరఫరా గొలుసు దెబ్బతినడం వల్ల 6 బిలియన్ డాలర్ల ఆదాయ లోటు అంచనా వేసినట్లు ఆపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. డిసెంబరులో సరఫరా గొలుసు పరిస్థితి మరింత దిగజారుతుందని ఆయన అంచనా వేస్తున్నారు.

ఆపిల్ సౌదీ అరామ్‌కోను అధిగమించింది..

ఆపిల్ 1 ట్రిలియన్ డాలర్లు..2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌ను చేరుకున్న మొదటి కంపెనీగా నిలిచింది. గత సంవత్సరం జూలై 2020లో, మార్కెట్ క్యాప్‌లో చమురు కంపెనీ సౌదీ అరామ్‌కోను అధిగమించి, ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ ట్రేడ్ కంపెనీగా అవతరించింది.

మైక్రోసాఫ్ట్ 2020లో ఆపిల్‌ను అధిగమించింది..

మైక్రోసాఫ్ట్ చివరిసారిగా 2020 లో మార్కెట్ క్యాప్‌లో ఆపిల్‌ను అధిగమించింది. ఆ సమయంలో కూడా కరోనా మహమ్మారి కారణంగా సరఫరా గొలుసు ప్రభావితమైంది. మైక్రోసాఫ్ట్ స్టాక్ ఈ సంవత్సరం 45% కంటే ఎక్కువ పెరిగింది. అదే సమయంలో, ఆపిల్ షేర్లు 15% మాత్రమే పెరిగాయి.

మైక్రోసాఫ్ట్ క్లౌడ్-ఆధారిత సేవ కోసం కరోనా సమయంలో డిమాండ్ గణనీయంగా పెరిగింది. దాని కారణంగా దాని స్టాక్ మంచి పెరుగుదలను చూసింది. మైక్రోసాఫ్ట్ జూన్‌లో మొదటిసారిగా 2 ట్రిలియన్ల డాలర్ల మార్కెట్ క్యాప్‌ను ముగించింది.

ఇవి కూడా చదవండి: Huzurabad by election: కాయ్ రాజా కాయ్.. మంచి తరుణం మించిన దొరకదు..

Telangana: తెలంగాణలో పుర కమిషనర్ల బదిలీలు.. ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి..

Puneeth Rajkumar Death: మొన్న సిద్ధార్థ్ శుక్లా.. నేడు పునీత్ రాజ్‌కుమార్‌.. ప్రాణాలు తీస్తోన్న ఓవర్ వర్కవుట్స్ !