Huzurabad By Election: నేడే హుజురాబాద్ ఉపఎన్నిక.. అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు..
మొన్నటి వరకు నేతల వంతు. ఇప్పుడు ఓటర్ల వంతు. హుజురాబాద్ ప్రజలు తమ తీర్పు చెప్పే టైం వచ్చింది. ఈరోజు ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఉప ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు...

మొన్నటి వరకు నేతల వంతు. ఇప్పుడు ఓటర్ల వంతు. హుజురాబాద్ ప్రజలు తమ తీర్పు చెప్పే టైం వచ్చింది. ఈరోజు ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఉప ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. హుజురాబాద్ ఉపఎన్నిక బరిలో మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ 2 లక్షల 37 వేల 36 మంది ఓటర్లు ఉన్నారు.
మహిళలు లక్షా 19 వేల 102మంది కాగా పురుషులు లక్షా 17వేల 993మంది ఉన్నారు. పోలింగ్ సిబ్బంది సామగ్రితో శుక్రవారమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉప ఎన్నిక పోలింగ్ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా చోట్ల చెక్‌పోస్టులు పెట్టి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. నేతల వాహనాలను తనీఖి చేశారు. 20 కంపెనీల కేంద్ర బలగాలు, 4 వేల మంది రాష్ట్ర పోలీసులు బందోబస్తులో ఉన్నారు. మొత్తం 306 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. 172 సమస్యాత్మకమైనవిగా, 63 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించి అదనపు భద్రతా సిబ్బంందిని పెట్టారు.
2018 ఎన్నికల్లో హుజురాబాద్‌లో 84.42 శాతం పోలింగ్ జరిగింది. ఈసారి అంతకన్నా ఎక్కువే ఓట్లు పోలవుతాయని తెలుస్తోంది. ఎందుకంటే గతంకన్నా 27 వేల మంది ఓటర్లు పెరిగారు. పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ఓటింగ్ శాతాన్ని పెంచుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్ గోయల్. కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. కరోనా నిబంధనలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకుని పోలింగ్ కేంద్రానికి రావాలని సూచించారు అధికారులు.
హుజూరాబాద్ మండలంలో 61, 673 మంది ఓటర్లు, ఇల్లందకుంటలో 24, 799, జమ్మికుంట 59, 200, వీణవంక 40, 990, కమలపూర్ 51, 282 మంది ఓటర్లు ఉన్నారు. 1,715 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొననున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న ఈటలపై ఎసైన్డ్ భూములు ఆక్రమించారనే ఆరోపణలు తెరపైకొచ్చాయి. మే 2న మంత్రి వర్గం నుంచి ఆయన బర్తరఫ్ అయ్యారు. జూన్ 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 14న భాజపాలో చేరారు. ఆగస్టు 11న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ.. యువనేత బల్మూరి వెంకట్‌ను బరిలోకి దించుతున్నట్లు ప్రకటించింది.
Read Also.. Huzurabad by election: కాయ్ రాజా కాయ్.. మంచి తరుణం మించిన దొరకదు..